E-Paper
Advertisement

OTT Movie : అబ్బాయిలపై పగతో రగిలిపోయే అక్కా చెల్లెళ్ళు… థ్రిల్లింగ్ ట్విస్టులతో మెంటలెక్కించే సైకో థ్రిల్లర్ మూవీ

OTT Movie : అబ్బాయిలపై పగతో రగిలిపోయే అక్కా చెల్లెళ్ళు… థ్రిల్లింగ్ ట్విస్టులతో మెంటలెక్కించే సైకో థ్రిల్లర్ మూవీ
Advertisement

OTT Movie :  సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాలు అంటే టక్కున గుర్తొచ్చేది భయంకరమైన అబ్బాయిల మోహమే. అయితే ఇదంతా పాత చింతకాయ పచ్చడి అనుకున్నాడో ఏమో ఓ దర్శకుడు రూటు మార్చి అమ్మాయిలనే సైకోలుగా చూపించే సాహసం చేశాడు. ఈ సినిమాలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు అబ్బాయిలపై పగ పెంచుకుని, వాళ్ళు కన్పిస్తే చాలు బ్రూటల్ గా ఏసేయ్యడమే పనిగా పెట్టుకుంటారు. ఈ ఇంట్రెస్టింగ్ కథ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఊరికి దూరంగా, ఒక ఒంటరి క్యాబిన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు నివశిస్తుంటారు. జెస్, మెగాన్ అనే ఈ కవల సోదరీమణులు ఇద్దరూ డిఫరెంట్ గా అలోచిస్తారు. జెస్సీ (లిలీ ఆంథోనిస్సెన్) ఓపెన్ మైండెడ్, స్ట్రైట్ గా ఉంటుంది. అయితే మెగాన్ (సాడీ కాట్జ్) ఆమెకు పూర్తి వ్యతిరేకం. అనుమానాస్పదంగా, దూకుడుగా, జెస్సీపై ఆధిపత్యం చెలాయించే స్వభావం కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో టామ్ (రాండీ వేన్) అనే ఒక హైకర్ ఉద్యోగం కోల్పోయి, ప్రశాంతత కోసం అడవిలో హైకింగ్‌కు వెళ్తాడు. రేడియోలో పోలీసులు ఒక సీరియల్ కిల్లర్ కోసం వెతుకుతున్నట్లు వార్త వస్తుంది. హైకింగ్ సమయంలో ఒక ఆకస్మిక తుఫాను కారణంగా టామ్… జెస్సీ, మెగాన్ నివసించే ఒంటరి క్యాబిన్ ‌లో ఆశ్రయం పొందుతాడు. జెస్సీని కిటికీలో నుంచి చూసి ఆకర్షితుడై, వాటర్ బాటిల్ నింపే సాకుతో క్యాబిన్ ‌లోకి ప్రవేశిస్తాడు. మెగాన్ కు అతనిపై అనుమానం వస్తుంది. కానీ తుఫాను కారణంగా అతన్ని రాత్రికి ఉండనిస్తుంది.

డిన్నర్ సమయంలో మెగాన్ టామ్‌ తో జెస్సీకి గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని చెప్తుంది. ఈ సంఘటన జెస్సీపై స్ట్రాంగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మీడియా ఆమెను “సర్కస్ యాక్ట్”గా చిత్రీకరించడంతో, దాని వల్ల ఆమె మానసికంగా కోలుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే మెగాన్ టామ్ ‌కు ఒక డ్రింక్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డ్రగ్స్ కలిపి ఉంటాయి. టామ్ ఆ డ్రింక్ తాగిన తర్వాత, అతను స్పృహ కోల్పోతాడు. కళ్ళు తెరిచి చూస్తే… అతన్ని ఒక గదిలో తాళ్లతో కట్టేసి ఉంటారు. జెస్సీకి అయిన గత గాయం కారణంగా పురుషులపై తీవ్రమైన విద్వేషం పెంచుకుంది మెగాన్. జెస్సీకి జరిగిన అత్యాచారానికి ప్రతీకారంగా టామ్‌ ను శిక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె టామ్‌ను శారీరకంగా, మానసికంగా హింసిస్తుంది. మెగాన్‌కు వ్యతిరేకంగా వెళ్లడానికి జెస్సీ భయపడినప్పటికీ, టామ్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. అతను ఆ గాయంతో సంబంధం లేని సాధారణ హైకర్ మాత్రమే అని వాదిస్తుంది. అయితే మెగాన్ కు మాత్రం ఎదురు చెప్పలేకపోతుంది. సినిమా చివరలో ఊహించని ట్విస్ట్ వెల్లడవుతుంది. ఇది కథను మరింత షాకింగ్‌ గా మారుస్తుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? చివరకు ఆ అబ్బాయి ఎలా తప్పించుకున్నాడు? మెగాన్ ఏం చేసింది? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Advertisement

మూవీ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మూవీ పేరు Megan . 2020 లో వచ్చిన ఈ మూవీకి సిల్వియో నాకుచ్చి దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ హారర్-థ్రిల్లర్ సినిమాలో రాండీ వేన్, సాడీ కాట్జ్, గ్రెగ్ ట్రావిస్, లిలీ ఆంథోనిస్సెన్ నటించారు. 1 గంట 29 నిమిషాల నిడివి ఉన్న ఈ సీరియల్ కిల్లర్ మూవీ ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలలో అందుబాటులో ఉంది.

Related News

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

Big Stories

Advertisement
×