E-Paper
Advertisement

OTT Movie : కొడుకు ముందే అలాంటి పని చేసే తల్లి … అద్దె కట్టడానికి అడ్డమైన పనులు … గుండెను పిండే ఓ సె*క్స్ వర్కర్ స్టోరీ

OTT Movie : కొడుకు ముందే అలాంటి పని చేసే తల్లి … అద్దె కట్టడానికి అడ్డమైన పనులు … గుండెను పిండే ఓ సె*క్స్ వర్కర్ స్టోరీ
Advertisement

OTT Movie : ఓటీటీ లోకి ఎన్నో రకాల స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వాటిలో కొన్ని స్టోరీలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా, ఒక మెసేజ్ ఇచ్చే మూవీ గా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ్ మూవీ లో భర్త వదిలేయడం వల్ల భార్య సెక్స్ వర్కర్ గా మారుతుంది. తన కొడుకు కోసం పడరాని పాట్లు పడుతుంది. ఇందులో ఒక సెక్స్ వర్కర్ జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. ఈ మూవీ పేరు ఏమిటి? నీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…

ఆహా (aha)లో

Advertisement

ఈ తమిళ డ్రామా మూవీ పేరు ‘మాలై నీరా మల్లిపూ’ (Maalai Nera Mallipoo). 2023 లో విడుదలైన ఈ మూవీకి సంజయ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో వినిత్ర మీనన్, అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లక్ష్మి అనే సెక్స్ వర్కర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కొడుకు కర్ణను కష్టాల నుండి రక్షించడానికి పోరాడుతుంది. ఈ స్టోరీ ప్రధానంగా కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితి, సమస్యలను చూపిస్తుంది. ఈ మూవీ ఆహా (aha) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెలితే

Advertisement

లక్ష్మికి పెళ్లి జరిగి ఒక కొడుకు కూడా ఉంటాడు. భార్య పిల్లల్ని పోషించలేక భర్త ఇంటినుంచి పారిపోతాడు. ఆతరువాత లక్ష్మి కొడుకుని పోషించుకోవడానికి ఒక సెక్స్ వర్కర్ గా మారుతుంది. ఇలా ఆమె తన కొడుకు కర్ణ ను స్కూల్ కి పంపుతుంది. ఆమె తన వృత్తిని కర్ణ నుండి దాచడానికి, తాను కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు అబద్ధం చెబుతుంది. తన భర్త గురించి కర్ణ అడిగినప్పుడు, ఆమె అతను విదేశాలలో ఉన్నాడని అబద్ధం చెప్తుంది. లక్ష్మి తన జీవితంలో జరుగుతున్న దారుణాలనుండి, కర్ణను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఒక సారి ఇంటి అద్దె కూడా కట్టడానికి డబ్బులు ఉండవు. దీనికి గానూ ఆమె చాలా కష్టపడుతుంది. కస్టమర్లతో ఎక్కువసమయం గడుపుతుంది. ఇలా జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఒక సమస్య వచ్చి పడుతుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధిస్తారు.

దీని కారణంగా ఆమె ఆదాయం ఆగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతాయి. దీంతో, ఆమె డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తుంది. ఇంట్లోనే ఉండి తన అందాలను ఆన్లైన్ లో చూపిస్తూ డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ నిర్ణయం ఆమె కొడుకుతో, ఆమె సంబంధాన్ని దూరం చేస్తుంది. ఆమె ఫోన్‌ను ఆన్‌లైన్ క్లాసుల కోసం కర్ణ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు, అందులో అర్ధనగ్న ఫోటోలు చూస్తాడు. ఆతరువాత ఆమె డోర్ లాక్ చేసుకోవడం మరచిపోయి ఆ పనిలో ఉంటుంది. ఇది కూడా చూసిన కొడుకు అక్కడినుంచి పారిపోతాడు. చివరికి ఈ స్టోరీ ఎక్కడిదాకా వెళ్ళి ఆగుతుందో, మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : నలుగురి చేతిలో నలిగిపోయే అమ్మాయి… మైండ్ బ్లాక్ అయ్యే బో*ల్డ్ సీన్స్ … మోస్ట్ కాంట్రవర్షియల్ రివేంజ్ థ్రిల్లర్

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×