OTT Movie : కొన్ని సినిమాలు వివాదాలతో రచ్చకెక్కుతాయి. వీటిని తీసే విధానం కూడా అలాగే ఉంటుంది. హింస తో పాటు బో*ల్డ్ సీన్స్ మితిమీరి ఉండటం వలన, ఈ సినిమాలు వివాదంలో చిక్కుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక ఒంటరి అమ్మాయిని, నలుగురు వ్యక్తులు దారుణంగా రే*ప్ చేస్తారు. ఇందులో ఉన్న హింస, అశ్లీల దృశ్యాల వలన ఈ మూవీ వివాదాస్పదం అయింది. మనుషులు అమ్మాయిలతో ఇలా కూడా ప్రవర్తిస్తారా అన్నట్లు ఉంటుంది. ఒంటరిగా చూడటానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఈ మూవీ. గూస్ బంప్స్ తెప్పించే ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
ప్లెక్స్ (Plex) లో
ఈ అమెరికన్ రే*ప్ అండ్ రివేంజ్ హారర్ ఫిల్మ్ పేరు ‘ఐ స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్ :డెజా వు’ (I Spit on Your Grave : Deja vu). 2019 లో రిలీజ్ అయిన ఈ మూవీకి మీర్ జార్చి దర్శకత్వం వహించారు. ఇందులో కామిల్లె కీటన్, జామీ బెర్నాడెట్ నటించారు. ఈ స్టోరీ జెన్నిఫర్ హిల్స్ అనే రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన మొదటి నవల రాయడానికి న్యూయార్క్ నగరం నుండి, కనెక్టికట్‌లోని ఒక సుందరమైన గ్రామీణ ప్రాంతంలోని ఒక కాటేజీకి వెళ్తుంది. ఆక్కడే ఈ సినిమా అసలు స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జెన్నిఫర్ న్యూయార్క్ నుంచి ఒక గ్రామీణ ప్రాంతానికి మొదటి సారిగా ఒక నవల రాయాడానికి వస్తుంది. ఒంటరిగా ఒక కాటేజీలో ఉంటూ తన రచనపై దృష్టి పెడుతుంది. అయితే, స్థానికంగా ఉండే నలుగురు మగవాళ్ళు జానీ, స్టాన్లీ, ఆండీ, మాథ్యూ ఆమెను గమనిస్తూ ఉంటారు. మొదట హెల్ప్ చేస్తున్నట్లు నటిస్తారు. ఆ తరువాత వారు ఆమెను వేధించడం మొదలు పెడతారు. ఒక రోజు ఆ నలుగురూ ఆమె కాటేజీలోకి చొరబడి, ఆమెపై కిరాతకంగా గ్యాంగ్ రే*ప్ చేస్తారు. వాళ్ళు చెప్పుకోలేనంత దారుణంగా ఆమె పై విరుచుకుపడతారు. ఆమెను దారుణంగా కొట్టి చనిపోయిందని భావించి వెళ్లిపోతారు. అయితే ఈ ఘటన నుండి జెన్నిఫర్ బతికి బయటపడుతుంది.
శారీరకంగా, మానసికంగా గాయపడినప్పటికీ, ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా అనుకుంటుంది. ఆమె తనపై దాడి చేసిన వారిని ఒక్కొక్కరినీ వెంబడిస్తుంది. వారి మీద క్రూరమైన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఒక్కొక్కరినీ విభిన్న మార్గాల్లో గొడ్డలితో, తాడుతో చంపుతూ తను పడిన బాధను వారికి అనుభవింపజేస్తుంది. ఒంటరిగానే వాళ్ళను చంపి తన పగను తీర్చుకుంటుంది జెన్నిఫర్. ఈ సినిమా తీవ్రమైన రేప్ సన్నివేశాల కారణంగా చాలా వివాదాస్పదమైంది. కొందరు దీనిని స్త్రీ శక్తి గురించిన కథగా భావిస్తే, మరికొందరు దీనిని దారుణమైన ఎక్స్‌ప్లాయిటేషన్ ఫిల్మ్‌గా విమర్శించారు.
Read Also : తీగలాగితే డొంకంతా కదిలింది … ఒక్క మర్డర్ లో ఇన్ని ట్విస్టులా … ఈ ఇన్వెస్టిగేషన్ కి ఓ దండం సామి