BigTV English

Preity Zinta : చాహల్ కు టైట్ హాగ్ ఇచ్చిన ప్రీతి జింటా

Preity Zinta : చాహల్ కు టైట్ హాగ్ ఇచ్చిన ప్రీతి జింటా

Preity Zinta :   ఐపీఎల్ సీజన్ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ముల్లాన్ పూర్ వేదిక గా కోల్ కతా నైడర్స్ జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తక్కువ స్కోరింగ్ గేమ్ లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. యజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సెన్ సంచలన బౌలింగ్ తో పంజాబ్ కింగ్స్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా టైట్ హాగ్ ఇచ్చింది ప్రీతి జింటా.


ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా.. సునీల్ సురైన్, వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ పడగొట్టారు. కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులు చేసింది. ముఖ్యంగా రఘువంశీ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీయగా..  మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీశాడు.

ఇక ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ ని డిఫెండ్ చేసుకున్న జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న 116/9 రికార్డును పంజాబ్ కింగ్స్ 111 అధిగమించింది. ఈ మ్యాచ్ లో చాహల్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను పంజాబ్ వైపు మలుపు తిప్పాడు. నిలకడగా ఆడుతున్న అజింక్యా రహానే ఔట్ చేసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అలాగే దూకుడుగా ఆడినటువంటి రఘువంశీ ని కూడా పెవీలియన్ కి చేర్చి పంజాబ్ విజయం లో కీలక పాత్ర పోషించాడు. ఒకే ఓవర్ లో వరుస బంతుల్లో డేంజరస్ ప్లేయర్ రింకూ సింగ్ 2, రమణ్ దీప్ సింగ్ డకౌట్ చేశాడు. దీంతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు చాహల్. అలాగే చివరలో భారీ షాట్లు ఆడిన రస్సెల్ ను ఔట్ చేసి జాన్సెన్ అన్ సంగ్ హీరోగా నిలిచాడు. 


Also Read: Russell Nose Ring: ఏంట్రా అది.. ఆండ్రీ రస్సెల్ పై ట్రోలింగ్… గేదె ముక్కులా ఉందంటూ

కేకేఆర్ 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే వరుస ఓవర్లలో ఓపెనర్లు సునీల్ నరైన్, డికాక్ వెంట వెంటనే ఔట్ అయ్యారు. దీంతో కేవలం 7 పరుగులకే కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్తితుల్లో రఘువంశీతో కలిసి రహానే ఆచితూచి ఆఢారు. రహానే వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఔట్ కాలేదు. రహానే కనుక రివ్యూ తీసుకుంటే.. కచ్చితంగా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దూకుడుగా ఆడుతున్న రఘువంశీ ని తన తరువాత ఓవర్ లో క్యాచ్ ఔట్ గా పెవిలియన్ కి చేర్చాడు. వెంకటేష్ అయ్యర్ ని మ్యాక్స్ వెల్ ను ఎల్బీ ఔట్ చేయగా.. రింకూ సింగ్ ను చాహల్ స్టంపౌట్ చేశాడు. ఆ తరువాత బంతికే రమణ్ దీప్ సింగ్ గోల్డెన్ డకౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. చివర్లో రస్సెల్ చాహల్ బౌలింగ్ 2 భారీ సిక్సులు బాదాడు. ఒత్తిడికి గురైన రస్సెస్ జాన్సన్ బౌలింగ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

ప్రీతి జింటా హగ్గులు

పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా.. మ్యాచ్ గెలిచిన తర్వాత… హగ్గులు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో చాహల్ అద్భుతంగా వికెట్లు పడగొట్టాడు. దీంతో పంజాబ్ అవలీలగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే.. చాహల్ కు హగ్ కూడా ఇచ్చింది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×