E-Paper
Advertisement

OTT Movie : భార్యా పిల్లలు ఉండగా మరో అమ్మాయితో… ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : భార్యా పిల్లలు ఉండగా మరో అమ్మాయితో… ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీలో భర్త మీద అనుమానం వస్తే ఎలా ఉంటుందనేది 2024లో వచ్చిన ‘మాగ్పై’ సినిమాలో చూపించారు. ఇది వరకే ఇలాంటి స్టోరీలు చాలానే వచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఒక అందమైన హీరోయిన్ వచ్చి పడితే ఏం జరుగుతుందో… ఆ టెన్షన్‌ని ఈ సినిమాలో గట్టిగా చూపించారు. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో ఉందంటే

‘మాగ్పై’ 2024లో విడుదలైన ఇంగ్లీష్ నియో నాయిర్ థ్రిల్లర్ మూవీ. సామ్ యేట్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో డైజీ రిడ్లీ (అనెట్ పాత్రలో), షాజాద్ లతీఫ్ (బెన్), మాటిల్డా లట్జ్ (అలిసియా) మెయిన్ లీడ్స్‌లో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. 90 నిమిషాల ఈ చిత్రం ఐయండిబిలో 6.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Huluలో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అనెట్, బెన్ అనే దంపతులకు ఒక చిన్న పాప ఉంటుంది. వాళ్ళ లైఫ్ మామూలుగానే సాగిపోతోంది. అనెట్ మరో సారి ఒక బాబుకు జన్మనిస్తుంది. బెన్ రైటర్ కావడంతో బయట తిరుగుతుంటాడు. ఇద్దరూ మధ్యలో ఫోన్‌లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రోజు వాళ్ల పాపకి ఒక పెద్ద సినిమాలో చిన్న రోల్ వస్తుంది. దీంతో కూతురితో సెట్‌కి తోడుగా బెన్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ అలిసియా ఉంటుంది. ఆమె ఇటీవల సెక్స్ టేప్ లీక్ అయి మీడియాలో రచ్చ చేసిన ఒక హాట్ టాపిక్ ఆంటీ. మొదట్లో బెన్ ఆమెని దూరంగానే చూస్తాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అలిసియా పాపతో చాలా బాగా కలిసిపోతుంది. పాపకి మంచి మాతృత్వం చూపిస్తుంది. బెన్ ఆమెలో ఏదో కొత్త సైడ్ చూసి మైమరిచిపోతాడు. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడటం, మెసేజ్‌లు, లేట్ నైట్ చాట్స్… ఇలా దూరంగా ఉన్న భార్యకి తెలియకుండా ఏదో జరుగుతుంది. అయితే ఇంట్లో ఉన్న అనెట్ ఇవన్నీ గమనిస్తుంది.

Read Also : సీరియల్ కిల్లర్‌గా స్టార్ హీరోయిన్… జైల్లో ఉంటూనే వరుస హత్యలు… టీజర్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్

Advertisement

మొదట అనెట్ కి బెన్ మీద చిన్న అనుమానం మొదలవుతుంది. తర్వాత ఈర్ష్యగా టర్న్ అవుతుంది. నా భర్త నా కూతురు సెట్‌లో ఏం చేస్తున్నారనే టెన్షన్ లో ఉంటుంది. ఫోన్ చెక్ చేయడం, సెట్‌కి వెళ్లి చూడడం, రాత్రిపూట ఏడవడం… ఇలా అనెట్ లోపల ఒక రకమైన పిచ్చి మొదలవుతుంది. ఇక ఆమె చర్యలు కూడా పీక్స్ కి వెళ్తాయి. క్లైమాక్స్ లో ఒళ్లు గగుర్పొడిచే ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? అలిసియాతో బెన్ రియల్‌గా సంబంధం పెట్టుకుంటాడా ? లేక అనెట్ మైండ్‌లోనే గోల చేసుకుంటుందా? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×