Team India Batting Coach: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa ) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై అనేక విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాల వల్ల టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిందని దారుణంగా ఆడుకుంటున్నారు అభిమానులు. గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కు అండగా నిలిచాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ (Team India Batting Coach Sitanshu Kotak ). ఇందులో గౌతమ్ గంభీర్ ( Gambhir) తప్పిదం ఏమీ లేదని, టీమిండియా బ్యాటర్లు సరిగ్గా రాణించకపోతే ఎక్కడ గెలుస్తామని ఫైర్ అయ్యారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై విమర్శలు వస్తుంటే, అతన్ని టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెనుకేసుకు వచ్చారు. గౌతమ్ గంభీర్ చాలా గ్రేట్ అంటూ కితాబ్ ఇచ్చారు. గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ చాలా మంది ఈ విమర్శలు చేస్తున్నారు… అదంతా తప్పు అంటూ మండిపడ్డారు. టీమిండియా బ్యాటర్లు అలాగే బౌలర్లు రాణిస్తే బాగుండేదని, వాళ్లు సరిగ్గా ఆడక పోవడం వల్ల టీమిండియా ఓడిపోయిందని క్లారిటీ ఇచ్చారు సితాన్షు కోటక్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ ను బ్లేమ్ చేయడం లేదని వివరణ ఇచ్చారు. ఆ గ్రౌండ్ లో బంతి త్వరగా టర్న్ అవుతుందని మేము ఊహించలేదని తెలిపారు. దానివల్ల టీమిండియా ఓడిపోయిందని స్పష్టం చేశారు. కానీ అనవసరంగా కొంతమంది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియాకు ఎన్నో టైటిల్ తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అంటూ పొగిడారు. అయితే గౌతమ్ గంభీర్ను వెనకేసుకు వచ్చిన బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ను కూడా టీమ్ ఇండియా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. గంభీర్ పెట్టే గడ్డి తినుకుంటూ బతుకు అంటూ సితాన్షు కోటక్ పై ఫైర్ అవుతున్నారు.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 9 గంటలకే రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. గౌహతిలో సూర్యుడు త్వరగా రావడమే కాకుండా త్వరగా వెళ్ళిపోతాడట. అందుకే 30 నిమిషాల ముందు మ్యాచ్ ప్రారంభం కానుంది. అలాగే నాలుగున్నర గంటలకే మ్యాచ్ క్లోజ్. ముఖ్యంగా రెండు టెస్టు నేపథ్యంలో టీ బ్రేక్ ఉదయం ఇస్తారు.. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది.
India’s batting coach Sitanshu Kotak has put the blame on the team for not performing well and losing the first Test against South Africa. #INDvsSA pic.twitter.com/qoPYU2ZqmN
— CricTracker (@Cricketracker) November 20, 2025