E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 సింహ రాశి ఫలితాలు

Yearly Horoscope: 2026 సింహ రాశి ఫలితాలు
Advertisement

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 సింహ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

సింహ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు లేదా హోదా మార్పు సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మధ్యలో ఆటంకాలు వచ్చినా సంవత్సరం ద్వితీయార్థంలో లాభాలు మెరుగుపడతాయి. ఆరోగ్య విషయంలో అలసట, పరిస్థితులు గందరగోళంగా ఉన్న నిలకడగా ముందుకు సాగటం మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి లక్ష్య సాధన చేస్తారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 5, వ్యయం 5,  రాజపూజ్యం 7, అవమానం 7.

జనవరి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అలసట అనిపించవచ్చు.   పనిభారం ఎక్కువగా ఉంటుంది. అధికారులతో మాటల్లో సంయమనం అవసరం. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. 

ఫిబ్రవరి :

ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మెల్లగా మెరుగుదల కనిపిస్తుంది. పాత బాకీలు రావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

మార్చి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు అవసరం. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. మాటల వల్ల వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.

ఏప్రిల్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా ధైర్యం పెరుగుతుంది. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపార రంగాలలో అనుకూలత పెరుగుతుంది. కొత్త అవకాశాలు రావచ్చు.  ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగే అవకాశం ఉన్నది.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ధన లాభయోగం ఉంది కానీ ఖర్చులు కూడా చేదాటుతాయి. భూమి లేదా వాహన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.  ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ప్రయాణాలు కొంత శ్రమ కలిగిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో మెల్లగా లాభాలు కనిపిస్తాయి.  ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

జూలై:

ఈ నెలలో ఈ రాశి వారికి  కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పనులు నెమ్మదిగా జరుగుతాయి. నిరుత్సాహం రావచ్చు కానీ సహనం అవసరం. ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారికి  గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మెరుగైన సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. క్రయవిక్రయ విషయాలు సామాన్యంగా ఉంటాయి.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో విశేషమైన పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  గృహమున శుభకార్య ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి సన్నిహితలతో మాట పట్టింపులు వచ్చే అవకాశం. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉద్యోగమున స్థాన చలన సూచనలు ఉన్నవి. విమర్శలు పెరిగే అవకాశం ఉన్నది.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి కుటుంబ పెద్దల అనుగ్రహం తోటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఊహించిన విధంగా పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఇంకా బయట సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటారు. అధికారుల అనుగ్రహంతో కీలక పదవులు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది.

ALSO READ: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×