E-Paper
Advertisement

Malayalam Comedy movies OTT : భయపెడుతూ నవ్వు తెప్పించే మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Malayalam Comedy movies OTT : భయపెడుతూ నవ్వు తెప్పించే మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Malayalam Comedy movies OTT : మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలను క్రేజీగా చూస్తున్నారు ఆడియన్స్. ముఖ్యంగా భయపెడుతూనే, మరోపక్క కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ జోనర్‌ ని చూసేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలు చేసే మ్యాజిక్ కూడా మామూలుగా ఉండదు. ఇలాంటి అదిరిపోయే మలయాళ హారర్ కామెడీల గురించి ఓ లుక్ వేద్దాం పదండి.

1. హలో మమ్మీ (Hello Mummy)

ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. షరాఫుద్దీన్, ఐశ్వర్య లక్ష్మి ఇందులో జంటగా నటించారు. పెళ్లయ్యాక భార్య వెంటే ఉండే ఆమె చనిపోయిన తల్లి ఆత్మ, అల్లుడిని ఎలా ఇబ్బంది పెట్టింది? ఆ పరిస్థితుల నుండి అతను ఎలా బయటపడ్డాడు? అనేది చాలా ఫన్నీగా చూపించారు. ఈ సినిమా Amazon Prime Videoలో మలయాళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

2. సుమతి వలవు (Sumathi Valavu)

ఒక మిస్టరీ ప్రాంతం, అక్కడ ఉండే ఒక పాడుబడ్డ ఇల్లు.. ఆ ఇంటి వెనుక ఉన్న భయంకరమైన గతం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అయితే ఆ ఉత్కంఠ కథలో కూడా కామెడీని భలేగా పండించారు. పాతకాలపు హారర్ సినిమాలను గుర్తుచేస్తూనే కొత్తగా అనిపిస్తుంది. ZEE5 ఓటీటీలో తెలుగు డబ్బింగ్‌తో సహా అందుబాటులో ఉంది.

3. కినావల్లి (Kinavalli)

ఈ సినిమా ఆరుగురు స్నేహితులు ఒక చోట కలిసినప్పుడు జరిగే వింత సంఘటనలతో నడుస్తుంది. ఇందులో గ్రాఫిక్స్, కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. హారర్ కంటే కూడా ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్, సస్పెన్స్ కట్టిపడేస్తాయి. ఇది Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

4. ప్రీతమ్-2 (Pretham 2)

జాన్ డాన్ బాస్కో పాత్రలో జ‌య‌సూర్య నటించిన ఈ చిత్రం ‘ప్రీతమ్’ సిరీస్‌లో రెండో భాగం. ఒక పాత బంగళాలో షార్ట్ ఫిలిం తీయడానికి వెళ్లిన కొందరు యువకులకి, అక్కడ ఆత్మల గోల మొదలవుతుంది. వాళ్ళని జాన్ డాన్ బాస్కో ఎలా కాపాడాడు అనేది కథ. రంజిత్ శంకర్ మార్క్ కామెడీ ఇందులో హైలైట్. ఒరిజినల్ మలయాళ వెర్షన్ Sun NXTలో ఉంది. తెలుగులో చూడాలనుకుంటే యూట్యూబ్‌లో లభిస్తుంది.

5. రోమాంచం (Romancham)

ఇది అసలు సిసలు మలయాళ సెన్సేషన్. ఓయిజా బోర్డ్ ఆడుతూ ఏడుగురు యువకులు ఒక ఆత్మను ఎలా పిలిచారు? ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో జరిగిన నవ్వు తెప్పించే పరిణామాలు ఏంటి? అనేది ఈ సినిమా. Jio Hotstarలో ఈ సినిమా తెలుగులో కూడా ఉంది.

Read Also :  బయట శత్రువులే కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరే… ఓటిటిలో దుమ్ము దులుపుతున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×