BigTV English
Advertisement

OTT Movie : హాస్పిటల్ స్టాఫ్ ను టార్గెట్ చేసి చంపే సైకో… హింట్ ఇచ్చి మరీ హత్యలు… గ్రిప్పింగ్ సైకాలజికల్ థ్రిల్లర్

OTT Movie : హాస్పిటల్ స్టాఫ్ ను టార్గెట్ చేసి చంపే సైకో… హింట్ ఇచ్చి మరీ హత్యలు… గ్రిప్పింగ్ సైకాలజికల్ థ్రిల్లర్

OTT Movie : ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్, గ్రిప్పింగ్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరప్పా అనుకునే ఓటీటీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ సీరియల్ కిల్లర్ కేసు, వెటరన్ కాప్ పర్సనల్ ట్రాజెడీలు, మెడికల్ మిస్టరీ వంటి అంశాలతో నిండి ఉంటుంది. మరి ఈ మూవీ పేరేంటి? కథ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


స్టోరీలోకి వెళ్తే…

కథ త్రిశూర్ లోని ACP అబ్రహాం ఓజ్లర్ (జయరామ్) చుట్టూ తిరుగుతుంది. అతను తన భార్య, కూతురు అదృశ్యమైన తర్వాత ఇన్సామ్నియా, హాల్యుసినేషన్స్‌తో బాధపడుతున్న వెటరన్ కాప్. ఇలాంటి పరిస్థితిలో సస్పెన్షన్ నుండి తిరిగి డ్యూటీలోకి వస్తాడు. ఒక సీరియల్ కిల్లింగ్ కేసు అతని ముందుకు వస్తుంది. ఒక కిల్లర్ యువతులను టార్గెట్ చేసి, వారి శరీరాలను కట్ చేస్తూ దారుణంగా హత్యలు చేస్తాడు. ఇక ఓజ్లర్, తన క్రిమినాలజీ నాలెడ్జ్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ సామ్యూల్ (అర్జున్ అశోకన్) సహాయంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు.

కిల్లర్ మోటివ్ మెడికల్ మిస్టరీతో లింక్ అవుతుంది. ఓజ్లర్ పర్సనల్ ట్రాజెడీలు కేసుతో ముడిపడి ఉంటాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఓజ్లర్ కిల్లర్ ప్యాటర్న్‌ను డీకోడ్ చేస్తాడు. మమ్మూట్టి క్యామియో పాత్ర (అలెగ్జాండర్) కేసుకు కీలకమైన ట్విస్ట్ జోడిస్తుంది. ఓజ్లర్ ఇన్సామ్నియా, హాల్యుసినేషన్స్ కేసు ఇన్వెస్టిగేషన్‌ను మరింత కాంప్లికేట్ చేస్తాయి. క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఇంతకీ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు? అనే విషయాలను మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.


హాట్ స్టార్ లో అందుబాటులో

Abraham Ozler అనేది మలయాళ సీరియల్ కిల్లర్ మూవీ. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మాన్యువల్ మూవీ మేకర్స్ – నెరంబోకు నిర్మించారు. 2024 జనవరి 11న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ఈ మూవీ మలయాళం ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్; హిందీ, తమిళ, తెలుగు, కన్నడ డబ్బింగ్ అందుబాటులో ఉంది. జయరామ్ (అబ్రహాం ఓజ్లర్), మమ్మూట్టి (అలెగ్జాండర్ – క్యామియో), అనస్వర రాజన్ (అభిరామి), అనూప్ మెనన్ (సురేష్ విజయన్), అర్జున్ అశోకన్ (సామ్యూల్), సాయిజు కురుప్ (డాక్టర్), సెంథిల్ కృష్ణ (జాగదీష్) ఈ సినిమాలో నటించారు. IMDbలో 6.6 ఉన్న ఈ మూవీ 2024లో మలయాళ ఇండస్ట్రీలో డీసెంట్ హిట్‌ గా నిలిచింది.

Read Also : అజ్ఞాత వ్యక్తి సర్ప్రైజింగ్ లెటర్స్… కట్ చేస్తే గుండె జారిపోయే ట్విస్ట్… సీరియల్ కిల్లర్ దగ్గర అడ్డంగా బుక్కయ్యే ఫ్యామిలీ

Related News

OTT Movie : అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

OTT Movie : సైకో కిల్లర్స్‌తో నిండిపోయే హోటల్… గ్రిప్పింగ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : భర్త బట్టల్లో మరో అమ్మాయి వెంట్రుకలు… ఆ భార్య ఇచ్చే షాక్‌కు ఫ్యూజులు ఔట్

OTT Movie : పీడకలగా మారే సైకో ఫ్యామిలీ మర్యాద… అతిథులను ఆహ్వానించి అన్నీ విప్పించి… మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్

Friday OTT Releases: శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి..

OTT Movie : బ్రూటల్ మర్డర్స్… అమ్మాయిల బట్టల వాసన చూస్తూ ఆ పాడు పని చేసే సైకో… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు

OTT Movie : భార్య కళ్ళముందే విదేశీ అమ్మాయితో… అన్నీ అవే సీన్లు… కల్లోనూ కలవరింతలు పుట్టించే కథ

OTT Movie : శుద్ధీకరణ పేరుతో సిగ్గులేని పని… భర్తను చంపేసి ఆశ్రమంలో అరాచకం… పెద్దలకు మాత్రమే

Big Stories

×