BigTV English

OTT Movie : అజ్ఞాత వ్యక్తి సర్ప్రైజింగ్ లెటర్స్… కట్ చేస్తే గుండె జారిపోయే ట్విస్ట్… సీరియల్ కిల్లర్ దగ్గర అడ్డంగా బుక్కయ్యే ఫ్యామిలీ

OTT Movie : అజ్ఞాత వ్యక్తి సర్ప్రైజింగ్ లెటర్స్… కట్ చేస్తే గుండె జారిపోయే ట్విస్ట్… సీరియల్ కిల్లర్ దగ్గర అడ్డంగా బుక్కయ్యే ఫ్యామిలీ

OTT Movie : హర్రర్ సినిమాలలో ఇంగ్లీష్ సినిమాలు మరింత ప్రత్యేకమని చెప్పాలి. సస్పెన్స్‌ ఫుల్ కథలు, సైకలాజికల్ టెన్షన్, రియల్-లైఫ్ ఇన్‌స్పిరేషన్‌తో అమెరికన్ మిస్టరీ హారర్ సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాగే 2022లో రిలీజ్ అయిన ఒక గ్రిప్పింగ్ మిస్టరీ హారర్ సిరీస్ ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ? ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో… 

రియల్-లైఫ్ “ది వాచర్” కేస్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ పేరు ‘The Watcher’. ఇది 7 ఎపిసోడ్‌ల మినీ సిరీస్ (ప్రతి ఎపిసోడ్ 45-60 నిమిషాలు). రయాన్ మర్ఫీ, ఇయాన్ బ్రెన్నాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) నిర్మాణంలో రూపొందగా, 2022 అక్టోబర్ 13న ప్రీమియర్ అయింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో నావమీ వాట్స్ (నోరా బ్రానాక్), బాబీ కానవాల్ (డీన్ బ్రానాక్), జెన్నిఫర్ కూలిడ్జ్ (ఎల్లెన్), మియా ఫారో (పెర్ల్ విన్స్లో), టెర్రీ కిన్నీ (రోజర్), మార్గో మార్టిన్‌డేల్ (జూడీ), క్రిస్టోఫర్ మెక్‌డోనాల్డ్ (డీన్ బ్రానాక్ సెక్రటరీ) నటించారు. IMDbలో 6.5 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ లో వచ్చే ఒక్కో ట్విస్ట్ అదిరిపోతుంది. సీజన్ 2 కూడా త్వరలోనే రానుంది.

స్టోరీలోకి వెళ్తే… 

కథ నోరా – డీన్ బ్రానాక్ (నావమీ వాట్స్, బాబీ కానవాల్) చుట్టూ తిరుగుతుంది. వెస్ట్‌ఫీల్డ్, న్యూజెర్సీలోని 657 బౌలెవార్డ్ అనే డ్రీమ్ హోమ్‌ను ఈ జంట కొంటుంది. సేవింగ్స్ అన్నీ పెట్టి డ్రీం హోమ్ కొనేస్తారు. అదే సంతోషంలో పిల్లలు ఎల్లీ (జెన్నా డేవిస్), లూక్ (కాలుమ్ జె. రాసెల్)తో కలిసి కొత్త ఇంట్లోకి మూవ్ అవుతారు. కానీ, అలా మూవ్ అయిన కొన్ని రోజుల్లోనే “ది వాచర్” అనే అజ్ఞాత వ్యక్తి నుండి లెటర్స్ అందుకుంటారు. అందులో హోమ్, ఆ ఫ్యామిలీ గురించి అన్నీ వివరాలతో సహా, లెటర్ రాసిన వ్యక్తి వాళ్ళనే చూస్తున్నట్టు ఉంటుంది.


డీన్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. నోరాతో కలిసి ఈ లెటర్స్ వెనుక ఉన్నది ఎవరో కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే పొరుగువారు… ఎల్డర్లీ విన్స్లో సిస్టర్స్ (మియా ఫారో, జెన్నిఫర్ కూలిడ్జ్), ఎక్సెంట్రిక్ మోడ్రిగల్ (టెర్రీ కిన్నీ), డీన్ పాస్ట్ ఫ్రెండ్ రోగర్ (క్రిస్టోఫర్ మెక్‌డోనాల్డ్)పై అనుమానాలు పెరుగుతాయి. ఫ్యామిలీ మార్నింగ్ రొటీన్‌లు, హోమ్ ఇన్స్పెక్షన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చే ట్విస్టులతో టెన్షన్ పెరుగుతుంది. డీన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ (హాల్యుసినేషన్స్), నోరా ఫ్రస్ట్రేషన్ కథను కీలక మలుపు తిప్పుతాయి. క్లైమాక్స్‌లో వాచర్ ఐడెంటిటీ రివీల్ అవుతుంది. ఇంతకీ ఆ వాచర్ ఎవరు? ఎందుకు ఈ ఫ్యామిలీని టెన్షన్ పెడుతున్నాడు? అనేది స్టోరీ.

Read Also : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : ఆత్మహత్య కోసం వెళ్లి ఐలాండ్ లో ఇరుక్కుపోయే అమాయకుడు… ట్విస్టులతో మెంటలెక్కించే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : ఇదెక్కడి పిచ్చి ప్రేమ సామీ… బతికుండగానే భార్యను బలిచ్చి దెయ్యంతో డీల్… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్స్

OTT Movie : శబ్దం చేస్తే బతికుండగానే నమిలి మింగేసే డెత్ ఏంజెల్స్… కల్లోనూ వెంటాడే 1 గంట 30 నిమిషాల థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో నుంచి పారిపోయి అబ్బాయిలతో అలాంటి పని… స్టేజ్ పైనే అంతా చేసే అమ్మాయి

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్కూల్లోనే దుకాణం ఓపెన్.. ఇటు గర్ల్ ఫ్రెండ్, అటు టీచర్ తో… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

Big Stories

×