E-Paper
Advertisement

Crime Thriller OTT: దుర్యోధనుడి అవతారంలో సీరియల్ కిల్లర్… యుగాలు దాటే ప్రతీకారం…కసిగా ఒక్కో హత్య

Crime Thriller OTT: దుర్యోధనుడి అవతారంలో సీరియల్ కిల్లర్… యుగాలు దాటే ప్రతీకారం…కసిగా ఒక్కో హత్య
Advertisement

Crime Thriller OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కు ఒక వేదికగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇంట్లోనే నచ్చిన కంటెంట్ ను చూస్తూ ప్రేక్షకులు కూడా రిలాక్స్ అవుతున్నారు. అందులోనూ థ్రిల్లర్ సిరీస్ లను తెగ చూస్తున్నారు కూడా. అయితే థ్రిల్లర్ ఫ్యాన్స్ మతి పోగొట్టిన ఒక సిరీస్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సిరీస్ కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో దుర్యోధనుడిగా ఫీల్ అయ్యే ఒక సైకో వరుస హత్యలు చేస్తూ అలజడి సృష్టిస్తాడు. ఈ 21వ శతాబ్దపు కురుక్షేత్రంలో అసలు మాస్టర్‌మైండ్ ఎవరో తెలుసుకోవడమే ఈ సిరీస్ కథ. స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ను ఇచ్చే ఈ సిరీస్ పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే 

ఈ బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘మహాభారత్ మర్డర్స్’ (Mahabharat Murders). ఇది అర్నాబ్ రే రాసిన నవల ఆధారంగా రూపొందింది. సౌమిక్ హల్దర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రియాంక సర్కార్, అర్జున్ చక్రబర్తి, శాశ్వత ఛటర్జీ, కౌశిక్ సేన్, రాజ్‌దీప్ గుప్తా నటించారు. ఇది 2022 మే 13 నుండి హోయిచోయ్‌లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 12 ఎపిసోడ్‌లతో బెంగాలీ, హిందీ భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది. Amazon MX Player, Airtel Xstream Play లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక సైకో గాడు తనే ఈ కాలపు దుర్యోధనుడిని అని ఫీలవుతూ, కోల్‌కతా సిటీలో రచ్చ రచ్చ చేస్తుంటాడు. మహాభారతంలో తాను దుర్యోధనుడినని, తనని అన్యాయంగా చంపేశారని, దానికి రివెంజ్ తీర్చుకోవడానికి మళ్లీ పుట్టానని అతను ఫీల్ అవుతుంటాడు. అందుకే ఈ కాలంలో పాండవుల్లాగా, ద్రౌపదిలాగా ప్రవర్తించే ఐదుగురు వ్యక్తులను టార్గెట్ చేసి, ఒక్కొక్కడిని అతి దారుణంగా లేపేస్తుంటాడు. అసలు వాడు ఎందుకు చంపుతున్నాడు? ఎవరిని చంపుతున్నాడు? అనేది అర్థం కాక పోలీసులు పిచ్చెక్కిపోతుంటారు. దీంతో
ఈ కేసును సాల్వ్ చేయడానికి రుక్సానా అనే గట్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆమెకు తోడుగా సిద్ధార్థ అనే మరో ఆఫీసర్ ఉంటాడు.

వీళ్లిద్దరూ ఆ కిల్లర్ వదిలిన క్లూస్ పట్టుకుని వెతుకుతుంటే, ఒక్కో హత్య వెనుక ఒక పెద్ద స్కెచ్ కనిపిస్తుంది. ఆ కిల్లర్ మామూలోడు కాదు, మహాభారతంలోని ఘట్టాలను పక్కాగా ఫాలో అవుతూ స్కెచ్ వేస్తాడు. పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే, వాళ్ళకే తెలియని షాకింగ్ విషయాలు బయటపడుతుంటాయి. చివరికి ఆ కిల్లర్ ఎవరు? వాడు నిజంగానే రివెంజ్ కోసం చంపుతున్నాడా ? దీని వెనుక ఏదైనా పెద్ద పొలిటికల్ గేమ్ ఉందా ? దుర్యోధనుడిగా చలామణి అవుతున్న ఆ సైకోను పోలీసులు పట్టుకుంటారా ? అనే విషయాలన, ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ మెచ్చిన సినిమా… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×