E-Paper
Advertisement

Malayalam Movies OTT : ‘ఎకో’ నుంచి ‘ఇన్నోసెంట్’ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మస్ట్ వాచ్ మలయాళం సినిమాలు

Malayalam Movies OTT : ‘ఎకో’ నుంచి ‘ఇన్నోసెంట్’ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మస్ట్ వాచ్ మలయాళం సినిమాలు
Advertisement

Malayalam Movies OTT : మలయాళ చిత్ర పరిశ్రమ ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల కోసం కొత్త చిత్రాలతో సిద్ధం అయ్యింది. థియేటర్లకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి, చూడటానికి ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళ సినిమాలు బెస్ట్ ఆప్షన్. మరి కాలు బయట పెట్టకుండా, కంటిరెప్ప ఆర్పకుండా చేసే ఆ సినిమాలు ఏంటి ? ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

EKO

దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’. ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్, బియానా మోమిన్, సిమ్ ఝీ ఫీ, వినీత్, బిను పప్పు కీలక పాత్రలు పోషించారు. కేరళ-కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న కట్టుకున్ను అనే ఏకాంత కొండ ప్రాంతంలో నివసించే మాలతి చెడతి అనే వృద్ధ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 31 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. థ్రిల్లర్‌లను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ ఉత్కంఠభరితమైన చిత్రం వర్త్ వాచింగ్ అన్పిస్తుంది.

Nidhiyum Bhoothavum

Advertisement

సాజన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ ‘నిధియుమ్ భూతవుమ్’. ఈ చిత్రంలో అనిష్ జి. మీనన్, అశ్వత్ లాల్, మహమ్మద్ రఫీ, విష్ణు గోవిందన్, నయారా నిహార్, భాసి వైకోమ్ కీలక పాత్రలు పోషించారు. ఈ కథ ముగ్గురు యంగ్ మెకానిక్ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వారు తమ బైక్ వర్క్‌షాప్‌ను దయ్యాలు ఉన్న హోమ్‌స్టేకు మారుస్తారు. ఈ చిత్రం డిసెంబర్ 30 నుండి SunNXTలో ప్రసారం అవుతుంది. హర్రర్ టచ్‌తో తేలికపాటి కామెడీని ఆస్వాదించే వారు ఈ మూవీని చూడాల్సిందే.

Ithiri Neram

ప్రశాంత్ విజయ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘ఎథిరి నేరం’. ఈ చిత్రంలో రోషన్ మాథ్యూ, జరీన్ షిహాబ్, నందు, కృష్ణన్ బాలకృష్ణన్ నటించారు. ఈ చిత్రం 2025 డిసెంబర్ 31 నుండి SunNXTలో ప్రసారం కానుంది. ఈ కథ చాలా సంవత్సరాల తర్వాత తిరువనంతపురంలో ఒక రాత్రి సమయం గడిపేందుకు తిరిగి కలిసే ఎక్స్ లవర్స్ అనిష్, అంజన చుట్టూ తిరుగుతుంది.

Innocent

Advertisement

సతీష్ తన్వి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘ఇన్నోసెంట్’. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, అనార్కలి మరిక్కర్, అజీజ్ నెడుమంగడ్, జోమోన్ జ్యోతి, నాజు ముధిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలోని తిరువనంతపురంలో ఒక ప్లానింగ్ ఆఫీసులో గుమస్తాగా పని చేసే 29 ఏళ్ల వినోద్ చుట్టూ కథ తిరుగుతుంది. వినోద్ క్రమశిక్షణతో ఉండే రొటీన్ వ్యక్తి. ఏవియేషన్ విద్యార్థిని రెజితతో నిశ్చితార్థం చేసుకుంటాడు. స్థానిక రెస్టారెంట్‌ లో భోజనం చేసిన తర్వాత అతనికి తీవ్రమైన ఫుడ్ పాయిజన్ అవుతుంది. దీంతో అతను లేడీస్ వాష్ రూమ్ లోకి వెళ్లడంతో ఊహించని టర్న్ తీసుకుంటుంది కథ. ఈ చిత్రాన్ని సైనా ప్లేలో చూడవచ్చు.

Read Also : చీకట్లో సైకో దెయ్యం పైశాచికత్వం… ఒళ్లు గగుర్పొడిచేలా ఒక్కో సీన్… ఒంటరిగా చూడొద్దు భయ్యా

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×