E-Paper
Advertisement

Malayalam OTT releases : 2025 చివరి వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళం సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Malayalam OTT releases : 2025 చివరి వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళం సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Malayalam OTT releases  : 2025 డిసెంబర్ చివరి వారం మలయాళం సినిమా ప్రియులకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాయి. ఈ వీక్‌లో అదిరిపోయే మలయాళం వెబ్ సిరీస్‌లు, సినిమాలు స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. మమ్మూట్టి థ్రిల్లర్ నుంచి నివిన్ పౌలీ సిరీస్ వరకు, వీకెండ్ బింజ్‌కు పర్ఫెక్ట్ ఆప్షన్స్. ఈ రిలీజ్‌లన్నీ ఎక్కడ చూడవచ్చో ఓ లుక్ వేద్దాం పదండి.

1. Dominic and the Ladies’ Purse

మమ్మూట్టి హీరోగా నటించిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ థియేటర్స్‌లో ఫ్లాప్ అయినా, ఓటీటీలో భారీ హిట్ అవుతోంది. డొమినిక్ అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఒక లేడీస్ హ్యాండ్‌బ్యాగ్ ఓనర్‌ను వెతుకుతాడు. ఆ బ్యాగ్ మర్డర్, మిస్సింగ్ కేస్‌కు లింక్ అవుతుంది. గోకుల్ సురేష్, సుష్మితా భట్, విజి వెంకటేష్ కీ రోల్స్ లో నటించిన ఈ సినిమా ట్విస్ట్స్, సస్పెన్స్‌తో నడిచే ఒక గ్రిప్పింగ్ స్టోరీ. JioHotstar & OTTplay Premium లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

2. Pharma (వెబ్ సిరీస్)

నివిన్ పౌలీ లీడ్ రోల్‌లో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఫార్మా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ సీక్రెట్స్‌ను ఎక్స్‌పోజ్ చేస్తుంది. డ్రగ్స్ ట్రయల్స్, కార్పొరేట్ గ్రీడ్, కామన్ పీపుల్‌పై ప్రభావం చుట్టూ సోషల్ మెసేజ్ ఇస్తుంది. గ్రావిటీ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి మిస్ చేయకూడదు. JioHotstar, OTTplay Premium, Manorama Max లో అందుబాటులో ఉంది.

3. Dies Irae

ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన ఈ లేటెస్ట్ హారర్ ఫిల్మ్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డిస్టర్బింగ్ సీక్వెన్సెస్ తో హారర్ ఫ్యాన్స్‌ ను గట్టిగానే భయపెట్టింది. ఒక రిచ్ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ చావుకు వెళ్ళి వచ్చాక భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. క్లైమాక్స్ వరకు స్టోరీ సస్పెన్స్ గానే సాగుతూ, సీక్వెల్ కి హింట్ ఇస్తుంది. JioHotstar, OTTplay Premium, Manorama Max లో ఇది అందుబాటులో ఉంది.

4. Nidhiyum Bhoothavum

హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా, ముగ్గురు యంగ్ టూ-వీలర్ వర్క్‌షాప్ డీలర్స్ హాంటెడ్ గెస్ట్‌హౌస్‌లోకి మారతారు. అక్కడ విచిత్ర సంఘటనలు మొదలవుతాయి. హారర్ కామెడీ కథలను ఇష్టపడే ఆడియన్స్ కి ఈ మూవీ బెస్ట్ సజెషన్. Sun NXT, OTTplay Premiumలో ఇది అందుబాటులో ఉంది.

 

Read Also :  ‘పర్ఫెక్ట్ క్రౌన్’ నుంచి ‘బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2’ వరకు… కొత్త ఏడాది ఓటీటీలోకి క్రేజీ కొరియన్ డ్రామాలు

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×