Psychological Thriller OTT : సైన్స్, హారర్ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్లకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. దెయ్యాలే లేవనే సైన్స్, దెయ్యాలే కాదు దేవతలు కూడా ఉన్నారు అనే మైథాలజీ… ఈ రెండు థీమ్స్ ను ఒకే స్టోరీలో చక్కగా డీల్ చేస్తే ఆడియన్స్ కు మంచి మూవీ దొరికినట్టే. ఇక ఈ జానర్లో వచ్చే సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వీక్షిస్తున్నారు జనాలు. అలా బెంగాలీ థ్రిల్లర్లకు రోజు రోజుకూ ఆదరణ పెరిగిపోతోంది. ఈరోజు అలాంటి బెంగాలీ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మన మూవీ సజెషన్.
2023లో రిలీజ్ అయిన బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రక్తకరబీ’ (Roktokorobi). సయంతన్ ఘోషాల్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకం టైటిల్ తో ఇన్‌స్పైర్ అయ్యింది. 11 ఎపిసోడ్స్ ఉన్న ఈ షో 2023 ఫిబ్రవరి 3న ZEE5లో రిలీజ్ అయింది. మెయిన్ లీడ్స్ గా విక్రమ్ చటర్జీ (సత్యకి – సైకాలజిస్ట్), రైమా సేన్ (రంజా – సత్యకి సిస్టర్-ఇన్-లా) నటించారు. రూక్మా రే, తులికా బసు, లబోనీ సర్కార్, శాంతిలాల్ ముఖర్జీ, భాస్వర్ చటర్జీ, అభిజిత్ గుహ, హరిదాస్ చటర్జీ సపోర్టింగ్ రోల్స్ పోషించారు. సయంతన్ ఘోషాల్ డైరెక్షన్‌లో సస్పెన్స్ బిల్డప్, షాకింగ్ ట్విస్ట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
Read Also : ఇదేం పిచ్చి ప్రేమ భయ్యా ? కనికరం లేకుండా మర్డర్స్… ఈ సైకో ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉన్నాడు ?
సినిమా అంతా సత్యకి (విక్రమ్ చటర్జీ) చుట్టూ తిరుగుతుంది. అతను బ్రిలియంట్ సైకాలజిస్ట్. కానీ తన పేషెంట్ కళ్లముందే సూసైడ్ చేసుకోవడంతో కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. డిప్రెషన్ తో ప్రాక్టీస్ ను వదిలేస్తాడు. ఈ నేపథ్యంలోనే రంజా (రైమా సేన్) ఇన్వైట్ చేయడంతో ఊర్లోని తన అత్త ఇంటికి వెళ్తాడు. అక్కడ ఫ్యామిలీలో సడన్ డెత్స్, రంజా హాలుజినేషన్స్ అతన్ని టెన్షన్ పెడతాయి. సత్యకి ఈ మిస్టరీలను ఇన్వెస్టిగేట్ చేస్తూ, ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ విషయం ఏంటి? ఎందుకు డాక్టర్ చుట్టూ ఉన్నవాళ్ళు చనిపోతున్నారు? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ సైకలాజికల్ థ్రిల్ డామినేట్ చేస్తుంది. ట్విస్ట్స్ ఫుల్‌గా ఉంటాయి, చివరి ఎపిసోడ్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి. ఇది మిస్టరీ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి మస్ట్ వాచ్. డార్క్ మిస్టరీస్ ఇష్టపడేవాళ్లకి పర్ఫెక్ట్ ఛాయిస్.