E-Paper
Advertisement

Netflix Best Horror Movie : భార్యను చంపే భర్త… పిల్లలను పెంచే దెయ్యం… ఇదెక్కడి దెయ్యం సినిమా భయ్యా ?

Netflix Best Horror Movie : భార్యను చంపే భర్త… పిల్లలను పెంచే దెయ్యం… ఇదెక్కడి దెయ్యం సినిమా భయ్యా ?
Advertisement

Netflix Best Horror Movie : ఆడియన్స్ ని భయపెట్టడానికి రకరకాల హర్రర్ థ్రిల్లర్లు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు విజువల్స్ తో వణుకు పుట్టిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా గోస్ట్ విజువల్స్, ఎమోషనల్ మదర్ సెంటిమెంట్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అయింది.ఈ సినిమా కథ ఒక విషాదకరమైన సంఘటనతో మొదలై, భయంకరమైన మలుపులతో సాగుతుంది. ఇది క్లైమాక్స్ వరకు ఆకట్టుకునే స్టోరీతో పాటు, వణుకు పుట్టించే భయాన్ని కూడా చూపిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

ఈ సూపర్నాచురల్ హారర్ మూవీ పేరు ‘మామా’ (Mama). డైరెక్టర్ ఆండీ ముస్చియెట్టి డైరెక్షన్లో ఇది తెరకెక్కింది. ఇది 2008 షార్ట్ ఫిల్మ్ ‘మామా’ ఆధారంగా రూపొందింది. ఈ మూవీలో జెసికా చాస్టెయిన్ (అన్నాబెల్), నికోలజ్ కోస్టర్ (లూకాస్), మెగన్ చార్పెంటియర్ (విక్టోరియా), ఇసబెల్ నెలిస్సే (లిల్లీ) మెయిన్ రోల్స్ లో నటించారు. ఇది $15 మిలియన్ల బడ్జెట్ తో $146 మిలియన్లను వసూలు చేసింది. 2013లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.

Advertisement

Read Also : హాంటెడ్ హౌస్ లో వణికించే దెయ్యాలు… రాత్రైతే రక్తపాతమే… ఒంటరిగా చూడకూడని సిరీస్

స్టోరీ ఏమిటంటే

వ్యాపారవేత్త అయిన జెఫ్రీకి బిజినెస్ లో బాగా లాస్ వస్తుంది. దీంతో అతను తన పార్టనర్స్ ను చంపి, తన భార్యను కూడా హతమారుస్తాడు. ఆ తర్వాత విక్టోరియా (3 ఏళ్లు) లిల్లీ (1 ఏళ్లు) అనే తన ఇద్దరు చిన్న కుమార్తెలను తీసుకుని అడవిలోకి పారిపోతాడు. మంచులో కారు ప్రమాదానికి గురవడంతో, వీళ్ళు అడవిలోని ఒక పాత పాడైపోయిన క్యాబిన్‌లోకి వెళ్తారు. అక్కడ జెఫ్రీ తన పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ సరిగ్గా అప్పుడే ఒక వింతైన, భయంకరమైన ఆకారం అతడిని చంపి, ఆ పిల్లలను రక్షిస్తుంది.

Advertisement

ఆ తర్వాత జెఫ్రీ సోదరుడు లూకాస్ తన అన్నయ్య కోసం, పిల్లల కోసం ఐదేళ్లుగా వెతుకుతూనే ఉంటాడు. చివరకు ఒక రెస్క్యూ టీమ్ అడవిలోని ఆ పాత క్యాబిన్‌లో ఆ ఇద్దరు అమ్మాయిలను కనుగొంటుంది. ఐదేళ్లపాటు మనుషులకి దూరంగా ఉండటం వల్ల వాళ్ళు జంతువుల వలె ప్రవర్తిస్తుంటారు. లూకాస్, అతని గర్ల్ ఫ్రెండ్ అనబెల్ ఆ పిల్లలను పెంచడానికి తమ ఇంటికి తెచ్చుకుంటారు. అయితే ఆ పిల్లలు ఒంటరిగా లేరని, వారితో పాటు అడవి నుండి ‘మామ’ అని వారు పిలుచుకునే ఒక ఆత్మ కూడా వచ్చిందని వారికి త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఆత్మ పిల్లల పట్ల చాలా పొసెసివ్ (అతి ప్రేమ)గా ఉంటుంది. లూకాస్ మీద దాడి చేసి అతడిని కోమాలోకి పంపిస్తుంది. దీంతో అనబెల్ ఒంటరిగా ఆ పిల్లలను కనిపెట్టుకోవాల్సి వస్తుంది.

అనబెల్ పరిశోధన చేయగా ‘మామ’ అసలు పేరు ఎడిత్ బ్రెన్నన్ అని తెలుస్తుంది. 1800ల కాలంలో ఎడిత్ ఒక మానసిక రోగి. తన బిడ్డను తన నుండి వేరు చేస్తారనే భయంతో, ఆమె తన బిడ్డను తీసుకుని కొండపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ దూకేటప్పుడు బిడ్డ ఒక చెట్టు కొమ్మకు చిక్కుకుపోతుంది, ఎడిత్ మాత్రం నీటిలో పడి చనిపోతుంది. చనిపోయిన తర్వాత కూడా తన బిడ్డ కోసం వెతుకుతూ ఆమె ఆత్మ అడవిలో తిరుగుతుంటుంది. ఆ క్రమంలోనే ఆమెకు విక్టోరియా, లిల్లీ కనిపిస్తారు. వారిని తన బిడ్డలుగా భావించి ఆమె పెంచుతుంది. క్లైమాక్స్ లో ‘మామ’ ఆ పిల్లలను తిరిగి అడవిలోకి తీసుకెళ్తుంది. అనబెల్, లూకాస్ వారిని కాపాడటానికి అక్కడికి వెళ్తారు. ఊహించని మలుపుతో ఈ కథ ముగుస్తుంది. ఆ మలుపు ఏమిటి ? ‘మామ’ నుంచి పిల్లలు బయట పడతారా ? అడవిలో ఏం జరుగుతుంది ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×