E-Paper
Advertisement

Sharwanand NNNM Movie: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన శర్వానంద్ కొత్త మూవీ.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Sharwanand NNNM Movie: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన శర్వానంద్ కొత్త మూవీ.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Sharwanand NNNM Movie:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో శర్వానంద్ (Sharwanand)ఇటీవల ‘నారీ నారీ నడుమ మురారీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా కాకుండా మరేదైనా తేదీలలో విడుదల అయ్యి ఉండి ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించేది అని అభిమానులే కాదు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు
ఎందుకంటే ఈ సంక్రాంతికి ప్రభాస్(Prabhas )లాంటి పాన్ ఇండియా స్టార్ ది రాజాసాబ్ (The Raja Saab) సినిమాతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరు దిగ్గజ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్లు పెద్ద ఎత్తున ఈ రెండు చిత్రాలకే కేటాయించారు.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నారీ నారీ నడుమ మురారి..

అటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ చిత్రానికి థియేటర్లు తక్కువగా లభించాయి. దీనికి తోడు ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో శర్వానంద్ కాస్త వెనుకడుగు వేశారనే చెప్పాలి. చిత్ర బృందం కూడా పెద్దగా ప్రమోషన్స్ చేపట్టలేదు. కేవలం మౌత్ టాక్.తోనే ఈ సినిమా ప్రజలలో ఆసక్తిని పెంచింది. అయితే సరైన థియేటర్లు లేక సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త సమస్యలు ఏర్పడ్డాయని వార్తలు కూడా వినిపించాయి. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. కేవలం నెలలోపే ఓటీటీ స్ట్రీమింగ్ కి రావడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేసినా మూవీ లవర్స్ కి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisement

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా వచ్చిన ఈ వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఫిబ్రవరి 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది .తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తున్నట్లు ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Kanchana Re release: మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతున్న కాంచన.. రీ రిలీజ్ డేట్ లాక్!

నారీ నారీ నడుమ మురారీ సినిమా స్టోరీ..

Advertisement

ఇంజనీరింగ్ చదివి ఒక కంపెనీలో ఆర్కిటెక్ గా చేసే గౌతమ్ (శర్వానంద్) ప్రముఖ లాయర్ రామలింగయ్య (సంపత్) కూతురైన తన తోటి ఉద్యోగి నిత్య (సాక్షి వైద్య) ప్రేమలో పడతాడు. సాంప్రదాయ బద్ధంగా హంగు ఆర్భాటంతో పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ వారి పెళ్లికి హంగామా లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెడతారు లాయర్ రామలింగయ్య. ఆ కండిషన్ దెబ్బతో గౌతమ్ కి అసలు సమస్య ఎదురవుతుంది. వీరి ప్రేమాయణం సాఫీగా సాగుతున్న తరుణంలో అదే కంపెనీలో టీం లీడర్ గా గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త మీనన్).ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చిన తర్వాత గౌతమ్ పరిస్థితి ఎలా మారింది ? అసలు గౌతమ్, దియా మధ్య ప్రేమ ఎలా మొదలైంది? వారిద్దరు ఎందుకు దూరం అయ్యారు. ? గౌతమ్ నిత్యా మధ్యలోకి దియా వచ్చిన తర్వాత అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నది మిగతా కథ.. ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ ప్రియులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×