E-Paper
Advertisement

Amazon: ఏఐ సాకు మాత్రమేనా? పాపం ఈ మహిళ ఆవేదన చూడండి.. అమెజాన్ లేఆఫ్స్ వెనుక అసలు రహస్యం ఇదే!

Amazon: ఏఐ సాకు మాత్రమేనా? పాపం ఈ మహిళ ఆవేదన చూడండి.. అమెజాన్ లేఆఫ్స్ వెనుక అసలు రహస్యం ఇదే!
Advertisement

టెక్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ కలకలం రేపాయి. అమెరికాలోని అమెజాన్ కార్యాలయాల నుంచి దాదాపు 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఏయే విభాగాల నుండి ఎవరెవరిని తొలగించారో తెలిపే ఒక స్ప్రెడ్‌షీట్ బయటకు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఉదంతంలో ముఖ్యంగా 11 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక మహిళా ఉద్యోగినికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పదకొండేళ్ల పాటు అమెజాన్‌లో విధులు నిర్వర్తించి, ఎన్నో ప్రశంసలు, ప్రమోషన్లు పొందిన సదరు ఉద్యోగిని తన ఆవేదనను లింక్డ్‌ ఇన్ వేదికగా పంచుకున్నారు. తాను పనిచేసిన కాలంలో తన టీమ్ పనులను సులభతరం చేసేందుకు, సిస్టమ్స్‌ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఆమె ఏ వ్యవస్థలనైతే మెరుగుపరిచారో.. అవే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపంలో ఆమె ఉద్యోగాన్ని మింగేశాయి. ‘నేను అభివృద్ధి చేసిన ఆటోమేషన్ వ్యవస్థలే చివరికి నా ఉనికిని లేకుండా చేశాయి’ అని ఆమె పేర్కొనడం విశేషం. దశాబ్ద కాలం పైగా విధేయతతో పనిచేసినా, ఆటోమేషన్ ముందు అనుభవం తలవంచక తప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఏఐ సాకు మాత్రమేనా?

అయితే.. ఈ లేఆఫ్స్ వెనుక కేవలం ఏఐ మాత్రమే ఉందని అందరూ భావించడం లేదు. అమెజాన్‌లో ఎనిమిదేళ్ల పాటు ఏఐ ప్రాజెక్టులకు నాయకత్వం వహించిన నిక్ ప్లమ్ అనే మరో ఉద్యోగి భిన్నమైన వాదనను వినిపించారు. ‘ఇది పనితీరుకు సంబంధించినది కాదు, అలాగని కేవలం ఏఐ వల్ల జరిగింది కూడా కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి, ఎక్కువ జీతాలు తీసుకునే అనుభవజ్ఞులైన ఉద్యోగులను వదిలించుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుకుంటున్నాయని ఆయన తెలిపారు. గ్లోబల్ అవుట్‌సోర్సింగ్, కార్మిక చట్టాల బలహీనత వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన విశ్లేషించారు.

Advertisement

ఈ విమర్శలపై అమెజాన్ స్పందిస్తూ.. ఇది సంస్థాగత పునర్నిర్మాణంలో భాగమని తెలిపింది. మేనేజ్‌మెంట్ పొరలను తగ్గించి, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా ‘రెడ్ టేపిజం’ను తొలగించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి 90 రోజుల పాటు అంతర్గతంగా వేరే విభాగాల్లో ప్రయత్నించుకునే అవకాశం కల్పించామని, అది సాధ్యపడకపోతే సెవెరెన్స్ ప్యాకేజీ, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

టెక్ రంగంలో వస్తున్న ఈ మార్పులు ఉద్యోగులకు ఒక గట్టి హెచ్చరికను పంపుతున్నాయి. మనం సృష్టించే సాంకేతికత మనకే సవాలుగా మారుతున్న వేళ, నైపుణ్యం, అనుభవం మాత్రమే ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాయి. ఖర్చుల తగ్గింపు పేరుతో కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలు వేల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేస్తున్నాయి.

ALSO READ: Realme 16 5G: 200MP కెమెరాతో రియల్‌మీ 16 ప్రో ఎంట్రీ.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదేమో!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×