iBell Turbostick650 Review: ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి మొదటి ప్రాధాన్యత. చీపుర్లు, బట్టలతో ఇల్లు ఊడ్చడం వల్ల చాలా వరకు దుమ్ము గాల్లోకి లేచి మళ్లీ ఫర్నిచర్‌పై పడుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వాక్యూమ్ క్లీనర్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలు , బ్యాచిలర్స్ కోసం ప్రముఖ బ్రాండ్ ఐబెల్ మార్కెట్లోకి తెచ్చిన ఈ మోడల్ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ. 2,160 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ క్లీనర్, తక్కువ ఖర్చుతో చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే ఈ మోడల్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందనే చెప్పొచ్చు. ఇంతకీ ఈ మోడల్ ఫూర్తి ఫీచర్లు ఏంటీ ? ధరల వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాక్యూమ్ క్లీనర్ మెయిన్ హైలైట్ దీని డిజైన్. ఇది స్టిక్ మోడల్‌లో చాలా స్టైలిష్‌గా తక్కువ బరువుతో వస్తుంది. దీన్ని ఇంటోలో ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లవచ్చు. సోఫాల కింద, మంచాల కింద లేదా గోడల మూలల్లో పేరుకుపోయిన దుమ్మును క్లీన్ చేయడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది. ఎక్కువ బరువు ఉండకపోవడం వల్ల మహిళలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేయవచ్చు.
సాధారణ బడ్జెట్ వాక్యూమ్ క్లీనర్లు కేవలం పొడి చెత్తను మాత్రమే పీల్చుకుంటాయి. కానీ ఐబెల్ టర్బోస్టిక్650 మోడల్ ‘వెట్ అండ్ డ్రై’క్లీనింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అంటే ఇంట్లో పొడిగా ఉన్న దుమ్మును పీల్చుకోవడంతో పాటు, అనుకోకుండా నేలపై పడిన నీరు లేదా ద్రవ పదార్థాలను కూడా ఇది ఇట్టే శుభ్రం చేస్తుంది. ఈ డ్యూయల్ ఫంక్షనాలిటీ దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.
ఇళ్లలోని గాలిని శుభ్రంగా ఉంచడంలో ఫిల్టర్ల పాత్ర చాలా ముఖ్యం. ఇందులో హై-క్వాలిటీ ‘వాషబుల్ హెపా ఫిల్టర్’ను వాడారు. ఫలితంగా ఇది అతి సూక్ష్మమైన దుమ్ము కణాలను కూడా లోపల బంధించి, గాలిలోకి వెళ్లకుండా ఆపుతుంది. ఫిల్టర్ మురికిగా.. మారితే నీళ్లతో కడిగి మళ్లీ ఉపయోగించవచ్చు. అలాగే సోఫాల మధ్య ఉండే సన్నని ఖాళీలను క్లీన్ చేయడానికి ప్రత్యేకంగా ‘క్రెవిస్ టూల్’ను అందించారు.
Also Read: రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !
చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇందులో పవర్ పుల్ మోటార్‌ను వాడారు. ఇది బలమైన సక్షన్ పవర్‌ను అందించి, క్షణాల్లో ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో పని చేయడం దీని అదనపు లాభం.
మీ బడ్జెట్ రూ.2,500 లోపు ఉండి, ఇల్లు , సోఫాలను శుభ్రం చేయడానికి ఒక మంచి పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ కావాలనుకుంటే ఈ మోడల్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. కాబట్టి వెంటనే ఆర్డర్ చేసి మీ ఇంటి పనులను మరింత ఈజీ చేసుకోండి.