E-Paper
Advertisement

Champion film OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఛాంపియన్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Champion film OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఛాంపియన్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Champion film OTT: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా థియేటర్లలో విడుదలైంది అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సినిమా తిరిగి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో విడుదలైన సినిమాలన్నీ కూడా ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీలోకి రాగా, మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.. ఇలా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలలో రోషన్ మేక(Roshan Meka) హీరోగా నటించిన ఛాంపియన్(Champion) సినిమా ఒకటి. స్వప్న దత్త సినిమా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

జనవరి 29న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం..

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకి త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్(Net Filx) మంచి ధరలకు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఈ సినిమా జనవరి 29వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని అధికారకంగా వెల్లడించారు.

బైరాన్ పల్లి గ్రామ నేపథ్యంలో..

Advertisement

ఈ సినిమా థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న నేపథ్యంలో థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సూపర్ హిట్ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాకు థియేటర్లలో కూడా మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్(Roshan), అనస్వర రాజన్(Anaswara Rajan) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలంగాణలోని బైరాన్ పల్లి గ్రామ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రోషన్ మైకేల్ అనే పాత్రలో కనిపిస్తారు. మైకెల్ కు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని ఉంటుంది అయితే మైకేల్ ఒక బేకరీలో పని చేస్తూ ఉంటారు.ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఫుట్ బాల్ మాత్రమే తనకున్న దారిగా కనిపిస్తుంది. ఫుట్ బాల్ చాంపియన్ గా నిలబడితే ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈయన ఫుట్ బాల్ చాంపియన్ గా సెలెక్ట్ అవుతారు. అయితే ఇంగ్లాండ్ వెళ్లడానికి ముందు మైకెల్ తన తండ్రి ఒకచోట తుపాకీలను డెలివరీ చేయాల్సిన పనిని ఈయన పూర్తి చేసి వెళ్లాల్సి వస్తుంది.ఇలా తుపాకులు డెలివరీ చేసే సమయంలో మైఖేల్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? మైఖేల్ కు బైరాన్ పల్లికి సంబంధం ఏమిటి? చివరికి మైఖేల్ ఇంగ్లాండ్ చేరుకున్నారా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: Mega 158: చిరు, బాబీ సినిమాకు వెరైటీ టైటిల్… వర్కౌట్ అయ్యేనా బాసూ?

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×