E-Paper
Advertisement

Mega 158: చిరు, బాబీ సినిమాకు వెరైటీ టైటిల్… వర్కౌట్ అయ్యేనా బాసూ?

Mega 158: చిరు, బాబీ సినిమాకు వెరైటీ టైటిల్… వర్కౌట్ అయ్యేనా బాసూ?
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi)తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈయన వశిష్ట దర్శకత్వంలో నటించిన విశ్వంభర సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇక చిరంజీవి తదుపరి సినిమా డైరెక్టర్ బాబి(Bobby) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నారు.

చిరంజీవికి జోడిగా ప్రియమణి?

ఇలా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో ప్రియమణి చిరంజీవికి జోడిగా నటించబోతున్నారని ఇందులో కృతి శెట్టి చిరంజీవి కూతురుగా కనిపించబోతున్నారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త హల్చల్ చేస్తుంది .ఈ సినిమాకు బాబి టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారని సమాచారం.

పరిశీలనలో కాకా టైటిల్..

Advertisement

ఈ సినిమాకు “కాకా”(Kaaka) లేదా “కాకాజీ” (Kaakaji)అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో బాబి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. కాకా అనే పదానికి హిందీలో యూనివర్సల్ అనే అర్థం వస్తుంది. ఇక తెలంగాణలో ఈ కాకా అనే పదం ఎక్కువగా వినపడుతుంది కాస్త వయసైన వారిని ఇలాగే పిలుస్తూ ఉంటారు కానీ ఆంధ్రాలో మాత్రం ఈ పదం వాడటం చాలా అరదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాకా అనే టైటిల్ కాస్త విభిన్నంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకు ఈ టైటిల్ పెడితే వర్కౌట్ అవుతుందా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

కలకత్తా బ్యాక్ డ్రాప్ …

Advertisement

ఇకపోతే ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ సినిమాగా ఉండబోతుందని ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు బయట హల్చల్ చేస్తున్న ఇప్పటివరకు బాబీ మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. ఇకపోతే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో క్యామియో కూడా ఉండబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా మెగా 158 గురించి వస్తున్న వార్తలన్నింటికీ పులి స్టాప్ పడాలి అంటే చిత్ర బృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. బాబి, చిరంజీవి కాంబినేషన్లో ఇదివరకు వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మెగా 158 పై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

Also Read: Prabhas: ది రాజా సాబ్ డిజాస్టర్.. పీపుల్ మీడియాకు ప్రభాస్ గుడ్ న్యూస్!

Related News

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

Big Stories

Advertisement
×