E-Paper
Advertisement

Champion OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’… కానీ చిన్న ట్విస్ట్

Champion OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

Champion OTT Release : శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఆశించినంత స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. క్రిస్మస్ కానుకగా వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 45 కోట్ల బడ్జెట్‌ తో కేవలం 11 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా గడవకముందే ఇప్పుడు ఓటీటీలో అడుగు పెట్టింది. ఇక ఓటీటీ ఆడియన్స్ ని ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్ళు దీనిపై ఓ లుక్ వేయండి. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2025 డిసెంబర్ 25న రిలీజ్ అయిన ‘ఛాంపియన్’ (Champion)మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నేటి నుంచి (జనవరి 29) స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రదీప్ అద్వైతమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంతో రూపొందింది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావడంతో థియేటర్లలో ఆశించిన స్థాయిలో రన్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీలో పుంజుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, జీ స్టూడియోస్ కలసి నిర్మించాయి. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఆడియోలతో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే హిందీలో రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఇందులో హీరోయిన్‌గా అనశ్వర రాజన్ నటించగా, నందమూరి కళ్యాణ చక్రవర్తి, మురళీ శర్మ, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మైఖేల్ (రోషన్ మేక) ఒక అద్భుతమైన ఫుట్‌బాల్ ప్లేయర్. లండన్‌లోని ఒక ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడాలనేది అతని ఏకైక లక్ష్యం. ఇంగ్లాండ్ వెళ్లడానికి అవసరమైన డబ్బు కోసం, మైఖేల్ ఒక పైలట్ ద్వారా అక్రమంగా ఆయుధాలను రవాణా చేసే పనిని ఒప్పుకుంటాడు. ఆ ప్రయాణంలో అనుకోని పరిస్థితుల వల్ల అతను తెలంగాణలోని భైరాన్‌పల్లి గ్రామానికి చేరుకుంటాడు. భైరాన్‌పల్లిలో రజాకార్ల అరాచకాలు, గ్రామస్థులు చేస్తున్న వీరోచిత పోరాటాన్ని మైఖేల్ కళ్ళారా చూస్తాడు. ఇక్కడే చంద్రకళ (అనస్వర రాజన్) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. మొదట తన లక్ష్యం మాత్రమే ముఖ్యమని భావించిన మైఖేల్, అక్కడి పరిస్థితులు ప్రభావంతో ప్రజల కోసం పోరాడటానికి సిద్దపడతాడు. చివరికి మైఖేల్ తన పోరాటాన్ని ఎలా సాగించాడు ? అతని ఫుట్‌బాల్ కల ఏమవుతుంది ? చంద్రకళతో ప్రేమలో పడతాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలీసుకోవాల్సిందే.

Read Also : 8 వింత సంఘటనల చుట్టూ తిరిగే మిస్టరీ… నిమిషానికో ట్విస్ట్ మావా… అదిరిపోయే ఫాంటసీ డ్రామా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×