E-Paper
Advertisement

Fantasy-mystery drama OTT : 8 వింత సంఘటనల చుట్టూ తిరిగే మిస్టరీ… నిమిషానికో ట్విస్ట్ మావా… అదిరిపోయే ఫాంటసీ డ్రామా

Fantasy-mystery drama OTT : 8 వింత సంఘటనల చుట్టూ తిరిగే మిస్టరీ… నిమిషానికో ట్విస్ట్ మావా… అదిరిపోయే ఫాంటసీ డ్రామా
Advertisement

Fantasy-mystery drama OTT : వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ బాగా అలవాటుపడిపోయారు. ఓటీటీ ఆన్ చేస్తే చాలు వీటిమీద ఓ కన్ను వేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక సుదీర్ఘ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ చైనీస్ సూపర్‌నాచురల్ మిస్టరీ హారర్ సిరీస్ ఒక్క సారి చూడటం స్టార్ట్ చేస్తే ఇక అస్సలు ఆపలేరు. హత్య కేసులు, దెయ్యాలు, మిస్టరీ మిక్స్‌తో ఈ సిరీస్ సస్పెన్స్ తో సాగుతుంటుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ చైనీస్ సూపర్‌నాచురల్ మిస్టరీ హారర్ సిరీస్ పేరు ‘టీన్‌సిన్ మిస్టిక్’ (Tientsin mystic). సీజన్ 1 (2017) లీ షియాన్ లీడ్‌లో హిట్ అయింది. సీజన్ 2, 2020 జులై 6న రిలీజ్ అయింది. మొత్తం 24 ఎపిసోడ్‌లతో వచ్చింది. 8 మిస్టీరియస్ కేసులు సాల్వ్ చేయడం చుట్టూ సాగుతుంది. ఇక మొదటి సీజన్‌లో హీరోగా నటించిన లి క్జియాన్ స్థానంలో, రెండవ సీజన్‌లో జిన్ షిజియా, ‘గువో డెయూ’ పాత్రలో నటించారు. Airtel Xstream Play, Amazon MX Player ప్లాట్‌ఫామ్‌లో ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి సీజన్ చివర్లో జరిగిన భారీ ప్రమాదం నుండి నగరం కోలుకుంటున్న టైమ్‌లో, టియాంజిన్ నదిలో మళ్ళీ వింత శవాలు బయటపడటం మొదలవుతాయి. గువో డెయూ మీద నేరం పడటంతో, అతను తనని తాను నిరూపించుకోవడానికి ఈ మిస్టరీని ఛేదించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే దున్నపోతులను బలి తీసుకునే వింతైన పురాతన ఆచారం వెనుక ఉన్న అసలు కుట్రలు బయటపడతాయి. సైన్స్ నమ్మే డింగ్ మావో, మంత్ర తంత్రాలు తెలిసిన గువో డెయూ కలిసి నగరానికి రాబోయే ఒక పెద్ద ముప్పుని ఎలా అడ్డుకున్నారనేది మెయిన్ స్టోరీ.

ఈ సీజన్‌లో కథ కేవలం చిన్న కేసులతోనే కాకుండా, రాజకీయ కుతంత్రాలు, పాత శత్రువుల రివెంజ్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా నదిలో జరిగే వింత సంఘటనలకు సైంటిఫిక్ రీజన్స్ వెతుకుతూనే, క్షుద్ర శక్తుల ప్రభావం ఉందా అనే కోణంలో సాగుతుంది. మొదటి సీజన్ లాగే విజువల్స్ అదిరిపోవడంతో పాటు, ప్రతి ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Advertisement

Read Also : కంటికి కన్పించని అద్దం నుంచి మరో ప్రపంచంలోకి… దొంగతనానికి వెళ్తే బుర్రపాడు ట్విస్ట్

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×