E-Paper
Advertisement

OTT Movie : భర్త ముందే భార్యని దారుణంగా… మతి మరుపుతోనే రివేంజ్ ప్లాన్… మళ్లీ మళ్ళీ చూడాలనిపించే మూవీ

OTT Movie : భర్త ముందే భార్యని దారుణంగా… మతి మరుపుతోనే రివేంజ్ ప్లాన్… మళ్లీ మళ్ళీ చూడాలనిపించే మూవీ
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలను ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. సినిమా అయిపోయాక కూడా 10 నిమిషాలు మాట్లాడలేరు. బుర్రలోనే గిర్రుమని తిరుగుతుంటుంది. ఈ రోజు మనం అలాంటి మూవీ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాలో హీరోకి 15 నిమిషాలకోసారి మెమొరీ లాస్ వస్తుంటుంది. భార్యని చంపిన వాళ్ళపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ స్టోరీ వింటుంటే సూర్య నటించిన ‘గజనీ’ సినిమా గుర్తుకు వస్తోంది కదూ! నిజమే ఈ సినిమా సేమ్ అలాగే ఉంటుంది. ఈ సినిమా ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఐయండిబిలో కూడా టాప్ రేటింగ్ ని పొందింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మెమెంటో’. 2000లో వచ్చిన ఈ సినిమా “మెమెంటో మోరి” అనే చిన్న కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో గై పియర్స్, క్యారీ-అన్నే మోస్, జో పాంటోలియానో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2000 సెప్టెంబర్ 5న వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం రెండు విభాగాలలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ నామినేషన్లను కూడా  పొందింది.  ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (Best Original Screenplay), ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ (Best Film Editing)ఈ రెండు విభాగాలలో నామినేట్ అయింది. 2001 మార్చి 16న థియేట్రికల్‌గా విడుదలై, విమర్శకుల ప్రశంసలు పొందింది. ఐయండిబిలో 8.4/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా prime video, netflix లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లెనార్డ్ అనే వ్యక్తి భార్యని ఇంట్లో ఇద్దరు దొంగలు అఘాయిత్యం చేసి చంపేస్తారు. లెనార్డ్ ఫైట్ చేస్తాడు కానీ తలకి గట్టి దెబ్బ తగిలి “షార్ట్ టర్మ్ మెమరీ లాస్” వస్తుంది. 10-15 నిమిషాలకోసారి మెమరీ రీసెట్ అవుతుంది. అతనికి ఏమీ గుర్తుండదు. అతని ఒక్కటే గోల్ ఉంటుంది. అతని భార్యని చంపిన జాన్ జి అనే వాడిని కనిపెట్టి చంపాలి. గుర్తుంచుకోవడానికి శరీరం మీద టాటూస్ రాసుకుంటాడు, పోలరాయిడ్ ఫోటోస్ తీసి దాని వెనుక వాళ్ళని నమ్మొచ్చా? నమ్మకూడదా? అని రాసుకుంటాడు. సినిమా మొత్తం రివర్స్‌లో నడుస్తుంటుంది.

Read Also : ప్రియుడికి షాక్ ఇచ్చే అమ్మాయి… ఫీలింగ్స్ రాలేదంటూ మరో అమ్మాయితో… అబ్బబ్బా ఏం సీన్స్ ఉన్నాయంటే

Advertisement

ఈ విషయంలో లెనార్డ్‌కి ఇద్దరు సహాయం చేస్తున్నట్టు కనిపిస్తారు. కానీ ఆ ఇద్దరూ లెనార్డ్‌ని ఉపయోగించుకుంటారు. తమ శత్రువుల్ని “జాన్ జి” అని చెప్పి లెనార్డ్ తో చంపిస్తారు. చివరి ట్విస్ట్ ఏంటంటే… భార్యని చంపిన జాన్ జి ఇప్పటికే చచ్చిపోయాడు. లెనార్డ్ గతంలోనే అతన్ని చంపేశాడు. కానీ మెమరీ రీసెట్ అవుతుంది కాబట్టి అతనికి ఎప్పటికీ గుర్తుండదు. ఎప్పటికీ అతన్ని చంపాలనే ఒక ఉద్దేశ్యం ఉంటుంది. చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది ? లెనార్డ్ లైఫ్ ఎటు వెళ్తుంది ? అనే విషయాలను, ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×