E-Paper
Advertisement

సైకో డాక్టర్ ప్రయోగంతో చచ్చే అమ్మాయి… మెంటలెక్కించే రివేంజ్ మర్డర్ మిస్టరీ

సైకో డాక్టర్ ప్రయోగంతో చచ్చే అమ్మాయి… మెంటలెక్కించే రివేంజ్ మర్డర్ మిస్టరీ
Advertisement

Mexican Mystery Thriller: ఒకమ్మాయి మిస్టీరియస్ గా చనిపోతుంది. దానికి కారణం అతని అన్నే అంటూ ఏకంగా 18 ఏళ్లు జైల్లో పెడతారు. అతను బయటకు ఉంటుంది కథ… ట్విస్టులే ట్విస్టులు. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ పేరే ‘హూ కిల్డ్ సారా?’ (Who Killed Sara?). మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకునే ముందు స్టోరీపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే… 

సిరీస్ మొత్తం అలెక్స్ గుజ్మాన్ తీర్చుకునే రివేంజ్ చుట్టూ తిరుగుతుంది. ఆ అబ్బాయి తన చెల్లెలు సారాను హత్య చేశాడనే తప్పుడు ఆరోపణలపై 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తాడు. నిజానికి అతను ఏ తప్పూ చేసి ఉండడు. కానీ మెక్సికోలోని అత్యంత శక్తివంతమైన, రాజకీయ పలుకుబడి ఉన్న లాజ్కానో కుటుంబం తమ కొడుకులను కాపాడుకోవడానికి అలెక్స్‌ను అన్యాయంగా బలిస్తుంది. 18 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అలెక్స్ మనసంతా కోపం, ప్రతీకారంతో నిండిపోతుంది.

Advertisement

లాజ్కానో కుటుంబం అసలు రంగును బయటపెట్టాలని అనుకుంటాడు. తన చెల్లెలు సారా చావుకు కారణమైన వ్యక్తిని పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇక్కడి నుంచి ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్‌గా మారుతుంది. 18 ఏళ్ల క్రితం ఆ మర్డర్ జరిగిన రోజుకు కథ షిఫ్ట్ అవుతుంది. సారా తన అన్న అలెక్స్, ప్రియుడు రోడాల్ఫో లాజ్కానో, అతని తమ్ముడు కెమాలోతో కలిసి బోట్ మీద పారాసైలింగ్ చేయడానికి వెళ్తుంది. గాల్లో ఎగురుతున్న సారా పారాచూట్ తాడు తెగిపోవడంతో నీళ్లలో పడి చనిపోతుంది.

అయితే ఇదేదో అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. ఎవరో కావాలనే తాడును కత్తిరించారని అలెక్స్ తెలుసుకుంటాడు. ఈ ఒక్క ఘటన చుట్టూనే సిరీస్ మొత్తం ఆసక్తికరంగా తిరుగుతుంది. అలెక్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు లాజ్కానో కుటుంబం డార్క్ సీక్రెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. డబ్బు, రాజకీయాలు, అక్రమ వ్యాపారాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి ఘోరాలు వెలుగులోకి వస్తాయి. కానీ అతను అనుకున్నట్టు సారా ఆ పారాసైలింగ్ ప్రమాదంలో చనిపోలేదు. మరి ఇంతకీ ఆ పిల్ల ఎలా చనిపోయింది ? దానికి కారణం ఎవరు ? ఆమె హత్యకు, లాజ్కానో ఫ్యామిలీకి ఉన్న లింక్ ఏంటి ? చివరికి హీరో హంతకుడిని పట్టుకున్నాడా ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడండి.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

2021లో విడుదలైన నెట్‌ఫ్లిక్స్ మైండ్-బెండింగ్ మెక్సికన్ రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ ‘హూ కిల్డ్ సారా ?’. మూడు సీజన్లతో ప్రేక్షకులను గందరగోళంలో పడేసి, చివరి ఎపిసోడ్ వరకు సస్పెన్స్‌ని మెయింటైన్ చేసిన అద్భుతమైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సిరీస్ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, స్పానిష్, హిందీ ఆడియోలతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాలి. ఒక ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే మధ్యలో ఆపలేరు. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

Read Also: ప్రతీ ఎపిసోడ్లో ఒక కొత్త కేసు… ట్విస్టులతో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×