E-Paper
Advertisement

Health Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హెల్త్ కార్డుల పంపిణీ!

Health Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హెల్త్ కార్డుల పంపిణీ!
Advertisement

Health Scheme: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 1:00 గంటకు హైదరాబాద్‌లోని సచివాలయంలో అధికారికంగా ప్రారంభించనున్నారు.

డిజిటల్ విధానంలో..

ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించనుంది. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు అధికారికంగా కొత్త హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఉద్యోగుల సౌకర్యార్థం రూపొందించిన ప్రత్యేక ఎన్ ఈహెచ్ ఎస్ వెబ్ పోర్టల్‌ను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా డౌన్‌లోడ్ చేసిన హెల్త్ కార్డుల పంపిణీ కూడా ప్రారంభ మవుతుంది.

Advertisement

Also read: Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు..

అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎంపానెల్ చేసిన 354 ప్రైవేట్, కార్పొరేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో పూర్తి క్యాష్‌లేస్ (నగదు రహిత) వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆయా ఆసుపత్రులతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. హైదరాబాద్‌లోని 15 ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఈ పథకం పరిధిలోకి రానున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు అత్యున్నత స్థాయి అత్యవసర వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి, సీఎస్, ఆరోగ్య శ్రీ సీఈవో తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

Also read: Food Poisoning: సిరిసిల్లలో దారుణం.. బకాసుర మండి బిర్యాని తిని 10 మందికి అస్వస్థత!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×