E-Paper
Advertisement

OTT Movie : సూర్యుడు అస్తమించని గ్రామంలో తెల్లార్లు నరకం చూపించే దెయ్యాలు… కళ్లముందే కనికట్టు మంత్రాలు

OTT Movie : సూర్యుడు అస్తమించని గ్రామంలో  తెల్లార్లు నరకం చూపించే దెయ్యాలు… కళ్లముందే కనికట్టు మంత్రాలు
Advertisement

OTT Movie : హారర్ సినిమాలు చాలా వరకు రాత్రిపూటనే తెరకెక్కుతుంటాయి. ఆ చీకట్లో దెయ్యాలను చూపిస్తూ ఆడియన్స్ ను భయపెడుతుంటాయి. అయితే ‘మిడ్‌సమ్మర్’ అనే సైకలాజికల్ హారర్ మూవీ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఈ సినిమా పగలే భయపెడుతుంది. ఈ స్వీడిష్ హారర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ‘పగటి హారర్’ అనే జానర్‌కి బెంచ్‌మార్క్ అయిపోయింది. దీనిని మిట్ట మధ్యాహ్నం చూసినా గుండెల్లో భయం పుడుతుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘మిడ్‌సమ్మర్’ (Midsommar) ఆరీ ఆస్టర్ (హెరెడిటరీ ఫేమ్) డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ హారర్ సినిమాలో ఫ్లోరెన్సీ ప్యూ (డానీ), జాక్ రేనర్ (క్రిస్టియన్) లీడ్ రోల్స్‌లో నటించారు. 3 గంటల థియేటర్ వెర్షన్ ఉన్న ఈ సినిమాను, 2 గంటల 27 నిమిషాలకు కుదించడం జరిగింది. ఐయండిబిలో ఇది 7.1/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime, MUBIలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

డానీ అనే అమెరికన్ అమ్మాయికి తన ఇంటి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. విషయం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆమె చెల్లెలు తల్లిదండ్రులిద్దరినీ కార్బన్ మోనాక్సైడ్‌తో చంపేసి తాను కూడా సూసైడ్ చేసుకుంది. డానీ మానసికంగా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ క్రిస్టియన్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎప్పుడో ఎండ్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఆమె మీద జాలి వల్ల వదలలేక పోయాడు. ఇద్దరి రిలేషన్ ఇప్పటికే టాక్సిక్ అయిపోయింది. క్రిస్టియన్ డానీ బాధని సీరియస్‌గా తీసుకోడు. అప్పుడే క్రిస్టియన్ ఫ్రెండ్ పెల్లె స్వీడన్‌లోని తన సొంత గ్రామంలో 90 ఏళ్లకోసారి జరిగే మిడ్‌సమ్మర్ ఫెస్టివల్‌కి ఇన్వైట్ చేస్తాడు. క్రిస్టియన్ డానీని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. ఆ గ్రామానికి వెళ్లగానే అందరికీ స్వర్గంలా అనిపిస్తుంది. అక్కడ ఎప్పుడూ పగలే ఉంటుంది. అందరూ వైట్ డ్రెస్‌లు, ఫ్లవర్ క్రౌన్స్, గ్రూప్ హగ్స్ తో ఫుల్ హ్యాపీగా ఉంటారు. డానీకి కూడా కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది.

Read Also : భర్త ముందే భార్యని దారుణంగా… మతి మరుపుతోనే రివేంజ్ ప్లాన్… మళ్లీ మళ్ళీ చూడాలనిపించే మూవీ

కానీ రెండో రోజు భయంకరమైన రిచ్యువల్ జరుగుతుంది. డెబ్బై ఏళ్లు నిండిన ఇద్దరు వృద్ధులు ఒక పర్వతం మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటారు. మొదటి వాడు చచ్చిపోతాడు, రెండో వాడు కింద పడ్డా బతికి ఉంటే రాళ్లతో తల పగలగొడతారు. ఇది చుసిన వీళ్ళు షాక్ అవుతారు. అయితే అక్కడివాళ్లు దీనిని సంబరంగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పటి నుంచి అక్కడ ఒక్కో వింత మొదలవుతుంది. మార్క్‌ కి మత్తు మందు ఇచ్చి ఒక అమ్మాయితో అలాంటి పని చేయించి, తర్వాత చంపేస్తారు. అక్కడ భయంకరమైన సెక్స్ రిచ్యువల్‌ జరుగుతుంది. దీంతో స్టోరీ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. చివరికి డానీ, క్రిస్టియన్ అక్కడి నుంచి బయట పడతారా ? ఆ భయంకరమైన రిచ్యువల్ లో బలైపోతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×