E-Paper
Advertisement

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్
Advertisement

Military Sci-Fi Anime OTT : ఒక వైపు భూమిపై నివసించే ప్రజలు, మరోవైపు అంతరిక్షంలో జీవిస్తున్న మనుషుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత. ఈ నేపథ్యంలో ఓ యువకుడు రహస్యమైన తిరుగుబాటు సంస్థకు నాయకుడిగా మారితే ? శత్రువులుగా భావించిన వ్యక్తుల మధ్యే ఊహించని బంధాలు ఏర్పడితే ? అత్యాధునిక మొబైల్ సూట్స్‌తో జరిగే యుద్ధం, రాజకీయ కుట్రలు, ప్రేమ, మిస్టరీ వంటి అంశాలన్ని ఒకే కథలో కలిస్తే ఎలా ఉంటుంది ? అలాంటి భారీ స్కేల్ మిలిటరీ సై-ఫై యానిమే మూవీనే ‘Mobile Suit Gundam Hathaway’. యోషియుకి టొమినో రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా 2021లో విడుదలైంది. మరి హాత్‌వే నోవా అసలు ఎవరు ? అతను ఎర్త్ ఫెడరేషన్‌పై ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాడు ? గిగీ అనే మిస్టీరియస్ యువతి అతని జీవితాన్ని ఎలా మార్చింది ? అనే వివరాలను తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

చార్ తిరుగుబాటు జరిగిన పన్నెండేళ్ల తర్వాత కథ మొదలవుతుంది. భూమి నుంచి అంతరిక్ష కాలనీలకు ప్రజలను బలవంతంగా తరలించే ఎర్త్ ఫెడరేషన్ విధానాలపై అసంతృప్తి పెరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో హాత్‌వే నోవా అనే యువకుడు మఫ్టీ అనే తిరుగుబాటు సంస్థలో కీలక నాయకుడిగా మారతాడు. అతని లక్ష్యం ఫెడరేషన్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడటమే. ఓ అంతరిక్ష ప్రయాణంలో హాత్‌వేకు గిగీ ఆండలూసియా అనే మిస్టీరియస్ యువతి పరిచయమవుతుంది.

Advertisement

అదే సమయంలో ఎర్త్ ఫెడరేషన్‌కు చెందిన కెన్నెత్ స్లెగ్ అనే అధికారి కూడా అతని జీవితంలోకి వస్తాడు. గిగీతో పెరుగుతున్న అనుబంధం, మరోవైపు కెన్నెత్ అనుమానాలు హాత్‌వే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఇక ఇందులో హైలైట్ భారీ మెకా యుద్ధాలే. అత్యాధునిక మొబైల్ సూట్స్‌తో జరిగే పోరాటాలు, భూమి నగరాల మధ్య ఛేజింగ్, ఆకాశంలో జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు భారీ స్కేల్ తీసుకొస్తాయి. హాత్‌వే తన మిషన్‌ను పూర్తి చేయగలడా ? అసలు మఫ్టీ లక్ష్యం ఏంటి ? గిగీ అసలు ఎవరిని నమ్ముతుంది ? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన థ్రిల్.

Also Read : 3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

షుకో మురాసే దర్శకత్వం వహించిన ‘మొబైలు సూట్ గుండం హాత్ వే’లో కెంషో ఒనో హాత్‌వే నోవాకు వాయిస్ ఇవ్వగా, రైనా ఉఎడా గిగీ ఆండలూసియాగా, జునిచి సువాబే కెన్నెత్ స్లెగ్‌గా వాయిస్ అందించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 96 నిమిషాలు ఉంటుంది. ఇది జపనీస్ ఒరిజినల్‌తో రూపొందిన యాక్షన్, సై-ఫై, మిలిటరీ అనిమే మూవీ. ప్రస్తుతం భారత్‌ లో Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అందులో లిస్ట్ చేసిన ఆడియోల్లో జపనీస్, ఇంగ్లీష్ మాత్రమే ఉన్నాయి. తెలుగు ఆడియో లేదు. కాబట్టి తెలుగులో చూడడం కష్టం. మెకా యాక్షన్, స్పేస్ వార్స్, రోబోటిక్ ఫైట్స్, పొలిటికల్ డ్రామా, గ్రిప్పింగ్ సై-ఫై కథలు ఇష్టపడే యానిమే ఫ్యాన్స్‌కు ఈ మూవీ మంచి విజువల్ రోలర్‌కోస్టర్.

Tags

Related News

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

Big Stories

Advertisement
×