E-Paper
Advertisement

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో
Advertisement

Kolkata: బెంగాల్‌లో అధికార బీజేపీ-విపక్ష టీఎంసీ మధ్య ప్రతీకార రాజకీయాలు, దాడులు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు సౌత్‌లోని తమిళనాడులో ఉండే ఈ కల్చర్, ఇప్పుడు బెంగాల్‌కు పాకింది. టీఎంసీని టార్గెట్ చేస్తూ దాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీసును ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అసలు ఏం జరిగింది?

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు

దేశంలో రాజకీయాలు రూటు మారాయి. దక్షిణాదిలోని తమిళనాడుకు పరిమితమైన ప్రతీకార రాజకీయాలు.. క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది.  నాయకులు ఆవేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టడం ఆపై దాడులు చేయించడం సాదారణంగా మారిపోయింది.  బెంగాల్ రాజధాని కోల్‌కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు.

Advertisement

గురువారం తెల్లవారుజామున ఆయా వ్యక్తులు హెల్మెట్లు, మాస్కులు ధరించి కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆఫీసులో నానా రభసా సృష్టించారు. దొరికన వస్తువులను చెల్లాచెదురుగా పడేసి పగల గొట్టారు. ఆ తర్వాత ఆఫీసు  అద్దాలను డ్యామేజ్ చేశారు. కార్యాలయంలో కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేశారు.

అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి వీడియో

ఈ ఘటనకు సంబంధించి వీడియోను అభిషేక్ బెనర్జీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనిపై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నోరు విప్పారు. ఈ ఘటన వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. బెంగాల్ గవర్నర్, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. సీఎం సువేందు అధికారి తనపై బెదిరింపులకు దిగుతున్నారని, టీఎంసీని చూసి భయపడుతున్నారని విమర్శించారు.

Advertisement

ప్రతిపక్షంపై హింసాత్మ ఘటనలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ. ఈ ఘటనను తాము ఎన్నటికీ మర్చిబోమని చెప్పకనే చెప్పారు.

ALSO READ: ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు?

హింసాకాండను ఎవరు ప్రణాళిక చేశారో, పదేపదే సమాచారం అందించినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో విచారణ జరపాలన్నారు. మరోవైపు ఎంపీ అభిషేక్ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. టీఎంసీయే ఈ విధ్వంసాన్ని సృష్టించిందని పేర్కొంది.ఇదంతా తృణమూల్ కాంగ్రెస్ పన్నాగమని, బీజేపీకి ప్రమేయం లేదన్నారు. వార్తల్లో నిలవడానికి ఇదంతా చేస్తున్నారని, ఆ సమయంలో తృణమూల్ కార్యకర్తలు ఆఫీసులో ఏం చేస్తున్నారని బరనగర్ బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ ప్రశ్నించారు.

 

 

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×