BigTV English
Advertisement

OTT Movie : ప్రియురాలి ఇంటికే పనోడిగా వెళ్ళే ప్రియుడు .. పొట్ట చెక్కలయ్యే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : ప్రియురాలి ఇంటికే పనోడిగా వెళ్ళే ప్రియుడు .. పొట్ట చెక్కలయ్యే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : రొమాంటిక్ కామెడీ సినిమాలను చూడటానికి అందరూ ఇష్టపడతారు. ఈ సినిమాలు సరదాగా సాగిపోతాయి. రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన ఒక మూవీ కామెడీ తో ఎంటర్టైన్ చేసింది. ఇందులో ప్రేమించిన, అమ్మాయి ఇంటికే ప్రియుడు పనోడిగా వెళ్తాడు. అక్కడ జరిగే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


ఆహా (Aha) లో

ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు’మిస్టర్. హౌస్ కీపింగ్’ (Mr. House Keeping). 2025 లో విడుదలైన ఈ మూవీకి అరుణ్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో హరి భాస్కర్, లోస్లియా మరియనేసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర సహాయక పాత్రల్లో ఇళవరసు, షా రా, రయాన్, ఉమా రామచంద్రన్ నటించారు. ఈ సినిమా 2025 జనవరి 24 నుండి థియేటర్లలో విడుదలైంది. మార్చి 25, 2025 నుండి టెంట్‌కొట్టా, అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్, ఆహా వంటి OTT ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.


స్టోరీలోకి వెళితే

కాలేజీలో చివరి రోజున ఇసై అనే అమ్మాయి తన తోటి విద్యార్థి హానెస్ట్ రాజ్ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. చాలా రోజులు నుంచి కలసి తిరిగి,ఇప్పుడు ప్రేమను నిరాకరించడంతో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్తాడు. ఇంతలో తెరుకుని, ఆమె తప్పును ఎత్తి చూపాలని అనుకుంటాడు. ఆమె ముందే ఒక ఛాలెంజ్ విసురుతాడు. నీకన్నా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, విజయవంతమైన జీవితాన్ని సాధిస్తానని సవాలు విసురుతాడు.నాలుగు సంవత్సరాల తర్వాత, హానెస్ట్ ఇప్పటికీ ప్రేమలో, ఉద్యోగంలో విఫలమైన వ్యక్తిగానే ఉంటాడు. అతను ఒక వ్యక్తికి 5,000 చెల్లించడానికి డబ్బు సంపాదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతను ఒక విల్లాలో హౌస్‌కీపర్‌గా ఉద్యోగం చేయడానికి వెళ్తాడు. ఆ ఇళ్ళు తన మాజీ ప్రేమికురాలు ఇసైదని తెలియకుండానే ఆక్కడ పని చేయడానికి వెళ్తాడు.హానెస్ట్ అక్కడ ఇసైను చూసి మరోసారి షాక్ అవుతాడు. ఇసై కూడా అతన్ని తన ఇంటి సహాయకుడిగా నియమిస్తుంది. ఇసై, హానెస్ట్‌ను పనిలో ఉంచుకుని, అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. వారి మధ్య ఘర్షణలు ఒక తెలివైన పోటీగా మారతాయి. ఈ క్రమంలో వారిద్దరిలో దాగి ఉన్న ఒక స్పార్క్ బయటపడుతుంది.

మరోవైపు హానెస్ట్ తాను చేసే ఉద్యోగాన్ని తన కుటుంబం నుండి దాచడానికి, ఒక IT కంపెనీలో ఉద్యోగం పొందినట్లు అబద్ధం చెబుతాడు. ఒక రోజు, ఇసై ఏర్పాటు చేసిన సమావేశంలో హానెస్ట్ అనుకోకుండా చిక్కుకోవడంతో, ఆమె అతన్ని తమ కాలేజీ స్నేహితుల ముందు అవమానిస్తుంది. అయితే, తర్వాత ఆమె తన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడుతుంది. ఇసై తన సహోద్యోగి హరీష్ తో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ హరీష్ వేరొక అమ్మాయితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ లో ఉన్నాడని తెలుసుకుని అతన్ని దూరం పెడుతుంది. ఈ సమయంలో ఇసై, హానెస్ట్‌తో గడిపిన సమయంలో, అతని నిజమైన ప్రేమను గుర్తిస్తుంది. అతని కుటుంబంతో కూడా సన్నిహితంగా మారుతుంది. చివరికి ఇసై హరీష్‌తో విడిపోయి, హానెస్ట్‌కు తన ప్రేమను వ్యక్తపరచాలని అనుకుంటుంది. కానీ అతను సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడని తెలుసుకుని ఆగిపోతుంది. చివరికి ఇసై, హానెస్ట్‌ ల ప్రేమకు శుభం కార్డ్ పడుతుందా ? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి.

Also Read : టీనేజ్ లో లవ్ లో పడితే, ఇలాగే రోడ్ల మీద… పక్కా అడ*ల్ట్ కంటెంట్… కుర్చీ కోసం పాడు పనులు

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×