OTT Movie : ఓటీటీలో బెంగాల్ సినిమాలు ఇప్పుడు ఒక ఊపు ఊపుతున్నాయి. ఒకప్పుడు వీటిని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే కధనంలో కొత్త తనాన్ని చూపించడంతో, ఈ సినిమాలు కూడా అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ మూవీ ఒక ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో కావాల్సినంత మసాలా ఉంటుంది. చివరివరకూ చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఈ బెంగాలీ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘మోన్ పొటోంగో’ (Mon Potongo). 2024 లో విడుదలైన ఈ సినిమాకు రాజ్‌దీప్ పాల్, శర్మిష్ఠా మైతీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి మధ్య ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. వీరు తమ గ్రామంలో వివాదాలు, వివక్షను ఎదుర్కొని, కోల్‌కతా నగర వీధుల్లోని ఫుట్‌పాత్‌లపై జీవితాన్ని గడుపుతారు. ఇందులో బో*ల్డ్ కంటెంట్ మీకు కావలసినంత ఉంటుంది. చూసినోళ్లకు చూసుకున్నంత అన్నట్లు ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix), ఆపిల్ టివి (AppleTV) లలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ మూవీలో సుభాంకర్ మొహంతా, బైశాఖీ రాయ్, సీమా బిశ్వాస్, జోయ్ సేన్‌గుప్తా ముఖ్య పాత్రలు పోషించారు. ‘మోన్ పొటోంగో’ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి, ఉత్తమ బెంగాలీ చిత్రంగా, గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకుంది.
స్టోరీలోకి వెళితే
టీనేజ్ లో ఉండే ఒక జంట ప్రేమించుకోవడం మొదలు పెడతారు. మతాలు వేరు కావడంతో, ఊరిలో వివాదాలలో పడతారు. ఇక అక్కడినుంచి సిటీకి పారిపోయి వస్తారు. అయితే వీళ్ళదగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో, ఫూట్ పాత్ పైనే పడుకుంటారు. కష్టతరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే రొమాన్స్ లో మాత్రం అందరినీ మించిపోతారు. సమయం దొరికినప్పుడల్లా ఆపనిలో బిజీ అయిపోతారు. ఒక రోజు ఒక ఫర్నీచర్ షోరూమ్‌లో ఉన్న రాజసమైన కుర్చీని చూసి ఆకర్షితులవుతారు. ఆ కుర్చీని చూస్తూ ఉన్నత జీవితం గడిపే ఊహాల్లో తెలుతుంటారు. వాళ్ళు ఆ కుర్చీని ఒకరికొకరు బహుమతిగా ఇచ్చి, రాజు-రాణిలా కలిసి కూర్చోవాలని కలలు కంటారు. అయితే, వారి ఆర్థిక స్థితి కారణంగా షోరూమ్‌లోకి ప్రవేశించడానికి కూడా అనుమతి లభించదు.
ఈ కలను సాకారం చేసుకోవడానికి, వారు వాన్‌పుల్లర్‌గా, ఇంటి పనిమనిషిగా కష్టపడి పనిచేస్తారు. సంపాదన ఆకర్షణలో పడి, వారు సమాజంలోని చీకటి, వెలుగు రెండు వైపులా జీవితాన్ని చూస్తారు. ఈ ప్రయాణంలో సమాజంలో ఒడిదుడుకులు, మతపరమైన ఉద్రిక్తతలు వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడితే వచ్చే కష్టాలన్నీ పడతారు. చివరికి వారి అత్యాశ, కలలు వారి ప్రేమను నాశనం చేస్తాయా ? లేక వారు ఫీనిక్స్ పక్షిలా మళ్లీ లేచి నిలబడతారా ? తమ కలల కుర్చీని ప్రేమ ఆసనంగా మార్చుకుంటారా ? అనేది ఈ బెంగాలీ రొమాంటిక్ డ్రామా మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read : ఆంటీలనే టార్గెట్ చేసి చంపే కిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ కు బుర్ర బద్దలే