E-Paper
Advertisement

OTT Movie : దేవుడి ఇంటికి రాసిన ఉత్తరంతో పోస్ట్ మ్యాన్ తిప్పలు… తండ్రి కోసం తల్లడిల్లిపోతూ

OTT Movie : దేవుడి ఇంటికి రాసిన ఉత్తరంతో పోస్ట్ మ్యాన్ తిప్పలు… తండ్రి కోసం తల్లడిల్లిపోతూ
Advertisement

OTT Movie : మరాఠీ నుంచి ఈ ఏడాది ఒక అద్భుతమైన సినిమా తెరకెక్కింది. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీతో కంటతడి పెట్టిస్తుంది. మనసుకు మంచి ఫీల్ ని ఇస్తున్న ఈ సినిమా ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది మరాఠీలో మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ కథలో ఒక చిన్న అమ్మాయి తన చనిపోయిన తండ్రికి లెటర్ రాసి “దేవుని ఇంటికి” పంపాలని ప్రయత్నిస్తుంది. ఆ ఉత్తరం చేర్చమని పోస్ట్ మ్యాన్ వెంట పడుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయి.  లైఫ్ లో ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన ఈ మరాఠీ ఫీల్ గుడ్ సినిమా పేరు ‘ముక్కాం పోస్ట్ దేవాచ్ ఘర్’ (Mukkam Post Devach Ghar). ఈ పేరుకు అర్థం ‘దేవుని ఇంటికి పోస్ట్’ అని వస్తుంది. సంకేట్ మానే దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మైరా వైకుల్ (జిజా, 2వ తరగతి అమ్మాయి), స్ప్రుహా పరాబ్ (జిజా తల్లి), మంగేష్ దేశాయ్ (పోస్ట్‌మ్యాన్), కల్యాణీ ములే (జిజా అమ్మమ్మ) లీడ్ రోల్స్ లో నటించారు. 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.7/10 రేటింగ్ పొందింది. 2025 జనవరి 31న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, Plex ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : మనవరాలు మిస్సింగ్… ఒక్క క్లూ కూడా దొరకని మెంటల్ మాస్ కేసు… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ భయ్యా

స్టోరీలోకి వెళ్తే

మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో జిజా అనే 2వ తరగతి చదువుతున్న చిన్న అమ్మాయి ఉంటుంది. ఆమె తండ్రి మిలటరీలో ఉద్యోగం చేస్తూ చనిపోతాడు. తల్లి బాధని దిగమింగుకుంటూ జిజాకి ఏం చెప్పాలో తెలియక మదనపడుతుంది. ఆమెకు తండ్రి దేవుని ఇంటికి వెళ్లాడని, అక్కడ సేఫ్‌గా ఉన్నాడని చెబుతుంది. జిజా స్కూల్‌లో లెటర్ రైటింగ్ నేర్చుకుని, తన తండ్రికి ఒక హార్ట్‌ఫుల్ లెటర్ రాస్తుంది. ఆ లెటర్ లో నాన్నా నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? నాకు నువ్వు ఎక్కువగా కావాలి. నీవు లేకపోతే నాకు బాధగా ఉంది అని రాసి ఉంటుంది. ఆ లెటర్‌ని “ముక్కాం పోస్ట్ దేవాచ్ ఘర్” (దేవుని ఇంటికి పోస్ట్) కి పంపాలని ప్రయత్నిస్తుంది. పోస్ట్‌మ్యాన్ ఆమెని చూసి జాలిపడతాడు. ఇది పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కాదు బేబీ, దేవుని ఇల్లు అడ్రస్ ఎవరికీ తెలియదని చెప్తాడు. కానీ జిజా ఆ లెటర్ ఎలాగైనా తన తండ్రికి పంపాలని బతిమాలుతుంది. జిజా మొదట పోస్ట్‌మ్యాన్‌ని ఫాలో అవుతుంది. అతను ఆమెకి సహాయం చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఫెయిల్ అవుతాడు. తర్వాత అమ్మమ్మకి చెబుతుంది. అమ్మమ్మ జిజా ఇన్నోసెన్స్ చూసి ఏడుస్తుంది. చివరికి ఆ చిన్నారి తన తండ్రికి ఏ విధంగా లెటర్ పంపుతుంది ? తన తండ్రి లేడన్న విషయం గుర్తిస్తుందా ? ఈ కథ ముగింపు ఏంటి ? అనే విషయలను, ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ని చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

 

 

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×