E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 90 : మళ్లీ కళ్యాణ్ కు నాగ్ సెల్యూట్… తనూజతో పాటు అందరికీ అక్షింతలు… సుమన్ – డెమోన్ ట్రోఫీని విరగ్గొట్టిన కెప్టెన్

Bigg Boss 9 Telugu Day 90 : మళ్లీ కళ్యాణ్ కు నాగ్ సెల్యూట్… తనూజతో పాటు అందరికీ అక్షింతలు… సుమన్ – డెమోన్ ట్రోఫీని విరగ్గొట్టిన కెప్టెన్
Advertisement

Bigg Boss 9 Telugu Day 90 : బిగ్ బాస్ షోలో మరో వీకెండ్ రానే వచ్చింది. ఆట ఆఖరి స్టేజ్ కు చేరుకోవడంతో ముందుగా నాగార్జున అందరిపై ప్రశంసలు కురిపించారు. అలాగే సీరియస్ ఇష్యూలను కూడా డిస్కస్ చేశారు. ముందు శుక్రవారం ఎపిసోడ్ ను చూపించారు. ఇక వస్తూనే నాగ్ “ఎవరు ఏమన్నా నీ డ్రెస్ మాత్రం బాగుంది” అంటూ డెమోన్ ను ప్రశంసించారు. ఎందుకంటే ముందు రోజు రాత్రి “డెమోన్ పవన్ గారిచే షర్ట్ లో నుంచి పావురాలు తీయుట, ప్యాంట్ లో నుంచి పాములు తీయుట వంటి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు మీకు రేపు చూపించబోతున్నాం” అంటూ కామెడీ చేశాడు. “టికెట్ టు ఫినాలే విన్నర్ ఎవరు” అంటూ కళ్యాణ్ ను ఆట పట్టించారు నాగ్. “నువ్వు డిజర్వ్డ్ ఇట్” అంటూ కళ్యాణ్.కు నాగ్ మరోసారి సెల్యూట్ చేశారు.

సంజనకు ఇమ్మూ అన్యాయం

రీతూ “సంజన, ఇమ్మూ టాస్క్ లో నీ జడ్జిమెంట్ కరెక్టేనా? జడ్జిమెంట్ ఏదైనా పంతంతో ఇచ్చావా? ఇమ్మూ గేమ్ కరెక్ట్ గానే ఆడావా?” అంటూ వీడియోను ప్లే చేశారు. అందులో ఇమ్మూ తాడు వదిలేసి కనిపించాడు. దీంతో ఇమ్మూ “బాడీకి చుట్టుకునే ఉన్నాను సార్. నిజంగా అది నా కాన్షియస్ లో ఉంటే ఒప్పుకునేవాడినే” అని వివరణ ఇచ్చాడు. “చేతిలో పట్టుకో అనేది రూల్ కదా. ఆడియన్స్ చాలా జాగ్రత్తగా చూస్తారు. కానీ లెక్కల టాస్క్ భలే ఆడావు. జిల్లా పరిషత్ హై స్కూల్ సూపర్” అంటూ నిలదీస్తూనే ప్రశంసించారు. అంతేకాదు రీతూని లెక్కల విషయంలో ఓ ఆట ఆడుకున్నారు.

తండ్రీకూతుర్లకు క్లాస్

Advertisement

ఆ తర్వాత తనూజా, భరణిల సీసాలను బండకేసి కొట్టి మరీ “విన్నర్ డిక్లేరయ్యాక నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తే లాభం ఏంటి?” అని తనూజాను అడిగారు నాగ్. “మూడు ఒకే షేప్ లో ఉండాలేమో అనుకున్నా” అని చెప్పింది తనూజా. “నువ్వేమో రెడ్ ది ట్రయాంగిల్ కాదు అంటావ్. భరణి ఏమో బ్లూ ది అసలు ట్రయాంగిలే కాదు రెక్త్యాంగిల్ అంటాడు. ఇందులో అసలు నాలుగు భుజాలు ఎక్కడున్నాయి? చెక్కినప్పుడు చిన్న బంప్ లాగా వచ్చింది అంతే” అంటూ రచ్చపై క్లారిటీ ఇచ్చారు. “అన్ని సమానంగా ఉండాలని చెప్పినట్టు అన్పించింది” అని తనూజా వివరణ ఇవ్వగా… “అలా ఎందుకు చెప్తారమ్మా… సరే ఇన్ని వారాలు ఉండేసరికి నాకు కాన్షియస్ లేదు. ఇదే వినిపించింది అంటూ అందరూ ఒక హ్యాలూజినేషన్ లోకి వెళ్ళిపోయారు” అంటూ ఇచ్చిపడేశారు నాగ్. ఇందులో తప్పంతా తనుజాదే అని చెప్పాక కూడా భరణి రీతూతో గొడవ పడ్డాడు.

తరువాత కోటింగ్ కెప్టెన్ కళ్యాణ్ కు పడింది. “నామినేషన్ లో పర్సనల్ విషయాలు మాట్లాడితే ఎందుకు వార్న్ చేయలేదు” అని అడిగారు నాగ్. “బిగ్ బాస్ ఆల్రెడీ వార్న్ చేశారు సార్” అని కళ్యాణ్ చెప్పగా… “సో నీ డ్యూటీ బిగ్ బాస్ చేశాడు” అంటూ మండిపడ్డారు. “డెమోన్ తప్పులు వెతకడంలోనే సరిపోయింది నీకు. ఆ ప్లాంక్ సరిగ్గా లేదు అన్నావ్. ఆడలేక మద్దెల ఓడు అన్నారట” అంటూ ఆ టాస్క్ కు సంబంధించిన వీడియోను ప్లే చేశారు. అలాగే టికెట్ టు ఫినాలే గెలిస్తే కాన్ఫిడెన్స్ అయ్యేది గెలవలేదు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది అంటూ ఇచ్చిపడేశారు. నామినేషన్ మార్చినందుకు సంజనకు వార్నింగ్ ఇస్తూనే, పాట విషయంలో ఇమ్మూ తప్పే లేదని క్లారిటీ ఇచ్చారు.

ట్రోఫీకి అర్హులు

Advertisement

చివరగా ట్రోఫీని పట్టుకుని తమకు తామే ఎందుకు ఆ ట్రోఫీకి అర్హులో చెప్పమన్నారు. మిగతా వాళ్ళు దానికి థంబ్సప్ లేదా డౌన్ ఇవ్వాలి. ఎలాగైనా జనాలను నవ్వించాలి. ఇక్కడ సిట్యుయేషన్ అన్నీ తట్టుకుని కూడా ప్రతిరోజూ ఎంటెర్టైన్ చేశాను. ఈసారైనా కమెడియన్ గా ఈ సీజన్ విన్ అవ్వాలనే సంకల్పంతో వచ్చాను అని చెప్పాడు ఇమ్ము. స్ట్రాంగ్ అనుకునే డెమోన్ నే ఓడించి, చాలా వరకు నా గేమ్ ను స్ట్రాంగ్ గా మార్చుకున్నా అంటూ భరణి చెప్పాడు. గర్ల్ టైటిల్ అని తనూజా, నేనెవరికి అన్యాయం చేయలేదు అని కళ్యాణ్, పాజిటివిటీతో ముందుకు వెళ్తున్నా అని రీతూ, జెన్యూన్ గా ఉన్నా అంటూ సంజన, బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నా అని సుమన్ చెప్పారు. అయితే రీతూకి భరణి, భరణికి రీతూ -డెమోన్, సుమన్ కు సంజన, సంజనకు భరణి – సుమన్ థంబ్స్ డౌన్ ఇచ్చారు. ఎక్కువగా సుమన్, డెమోన్ లకే థంబ్స్ డౌన్ వచ్చాయి. నాగ్ సలహా మేరకు థంబ్స్ ఎక్కువగా వచ్చిన కెప్టెన్ కళ్యాణ్ సుమన్ – డెమోన్ ల ట్రోఫీని విరగ్గొట్టాడు.

Read Also : ఒంటరైన ప్రేమ పక్షులు డెమోన్ – రీతూ… మరీ ఇలా పగబట్టారేంటి భయ్యా ?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×