E-Paper
Advertisement

Ind vs Sa 3rd Odi: ద‌క్షిణాఫ్రికాపై ప్ర‌తీకారం, విశాఖలో టీమిండియా విక్ట‌రీ…2-1 తేడాతో వ‌న్డే సిరీస్ కైవ‌సం

Ind vs Sa 3rd Odi: ద‌క్షిణాఫ్రికాపై ప్ర‌తీకారం, విశాఖలో టీమిండియా విక్ట‌రీ…2-1 తేడాతో వ‌న్డే సిరీస్ కైవ‌సం
Advertisement

Ind vs Sa 3rd Odi: అంద‌రూ ఊహించిన‌ట్లుగానే టీమిండియా రెచ్చిపోయింది. స‌ఫారీల‌పై వ‌న్డే సిరీస్ గెలుచుకుంది టీమిండియా. విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి మూడో వన్డేలో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూడో వన్డేలో విజయం సాధించి, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా రాణించిన టీమిండియా, తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 39.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ నష్టపోయి దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా జట్టు. ఈ త‌రుణంలోనే టెస్ట్ గెలిచిన దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్రతికారం తీర్చుకున్నట్లయింది.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

విశాఖలో టీమిండియా విక్ట‌రీ…2-1 తేడాతో వ‌న్డే సిరీస్ కైవ‌సం

Advertisement

విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ( India vs South Africa, 3rd ODI) ప్లేయ‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ లో య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ చేయ‌గా, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఇద్ద‌రూ అర్ధ సెంచ‌రీలు న‌మోదు చేసుకున్నారు. 121 బంతుల్లో 116 ప‌రుగులు సాధించాడు య‌శ‌స్వి జైస్వాల్. రోహిత్ శ‌ర్మ 73 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. అయితే, సెంచ‌రీ చేసే క్ర‌మంలో క్యాచ్ ఔట్ అయ్యాడు రోహిత్ శ‌ర్మ‌. ఇక హిట్ మ్యాన్ వికెట్ కోల్పోయిన త‌ర్వాత‌, కింగ్ కోహ్లీ రంగంలోకి దిగాడు. విరాట్ కోహ్లీ ( Virat Kohli) రంగంలోకి దిగిన త‌ర్వాత‌, ఏ మాత్రం ఆగ‌లేదు. 45 బంతుల్లోనే 65 ప‌రుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇందులో 3 సిక్స‌ర్లు 6 బౌండ‌రీల‌తో రెచ్చిపోయాడు కోహ్లీ. ఈ ముగ్గురు రెచ్చిపోవ‌డంతో టీమిండియా మూడో వ‌న్డేలో విజ‌యం సాధించింది. టెస్ట్ సిరీస్ గెలిచిన బ‌లుపులో ద‌క్షిణాఫ్రికా ఉండ‌గా, వాళ్ల పొగ‌రు దించారు మ‌నోళ్లు. వ‌న్డే సిరీస్ గెలుచుకుని, సౌతాఫ్రికాపై ప్ర‌తీకారం తీర్చుకుంది టీమిండియా.

రెండు సంవత్సరాల తర్వాత టాస్ గెలిచిన టీమిండియా

విశాఖపట్నం వేదికగా జరిగిన మూడవ వండే సందర్భంగా టీమిండియా టాస్ గెలిచింది. దాదాపు 20 మ్యాచ్ లు, రెండు సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలిచింది. దీంతో టాస్ గెలిచిన టీమిండియా జట్టు మొదట బౌలింగ్ తీసుకుంది. ఈ గ్రౌండ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లే ఎక్కువగా విజయాలు ఉన్న‌ట్లు రికార్డులు ఉన్నాయి. ఇందులో భాగంగానే టీమిండియా మొదట బౌలింగ్ చేయక దక్షిణాఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసింది. అటు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో ఆల్ అవుట్ అయి 270 పరుగులు చేసింది. క్వింటాన్‌ డికాక్ ఒక్కడే 106 పరుగులు చేయగా కెప్టెన్ బవుమా 48 పరుగులతో రాణించాడు. మిగతా ప్లేయర్లు అందరూ చేతులెత్తేశారు. ఇక 271 పరుగుల లక్ష్యాన్ని ఒకే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది టీమిండియా.

Advertisement

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×