E-Paper
Advertisement

OTT Movie : కాంట్రాక్టర్ మర్డర్ లో దుమ్ము రేపే ఇన్వెస్టిగేషన్… విస్తుపోయే నిజాలు… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కాంట్రాక్టర్ మర్డర్ లో దుమ్ము రేపే ఇన్వెస్టిగేషన్… విస్తుపోయే నిజాలు… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి వస్తున్న సినిమాలలో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ప్రతి భాషలో ఇలాంటి సినిమాలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ట్విస్ట్లు బోలెడు ఉన్నాయి. ఎప్పటిలాగే క్లైమాక్స్ లోనే కిల్లర్ ఎవరో రివీల్ అవుతుంది.ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

2021 మార్చి 19న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ కన్నడ మూవీ పేరు ‘ముండువరేడ అధ్యాయ’ (Munduvareda Adhyaya). బాలు చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అదిత్యా, అశికా సోమశేఖర్, జయ్ జగదీష్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 120 నిమిషాల రన్‌ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెంగళూరులోని ఓ బంగళాలో రాత్రి ఒంటి గంట సమయంలో ప్రముఖ కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం విశ్వాస్ నారాయణ్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఎవరో ఇంట్లోకి దూరి, గొంతు కోసి హత్య చేస్తారు. హత్య జరిగినప్పుడు ఇంట్లో CCTV కెమెరాలు ఆఫ్ చేసి ఉంటాయి. సర్వెంట్స్ అందరికీ ఆ రోజు సెలవులో ఉంటారు. కేసు సూపర్ మిస్టరీగా మారుతుంది. ఈ కేసు హ్యాండిల్ చేయడానికి ACP బాలకృష్ణ వస్తాడు. అతను చాలా షార్ప్ మైండెడ్, ఎమోషన్స్ లేని రోబో లాంటి కాప్. ఇతని ఇన్వెస్టిగేషన్ స్టైల్ చాలా డిఫరెంట్ గా విచారిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వాళ్లతో విశ్వాస్‌కి ఉన్న గొడవలు తెలుసుకుంటాడు. ప్రధాన సస్పెక్ట్స్ చింతన్ అనే వ్యక్తి ఉంటాడు. అతను విశ్వాస్‌తో కలిసి రూ. 300 కోట్ల ల్యాండ్ డీల్ చేశాడు. విశ్వాస్ అతన్ని మోసం చేసి డబ్బులు కాజేసాడు. చింతన్ బెదిరించిన ఆడియో క్లిప్ కూడా దొరుకుతుంది.

Read Also : డీజిల్ స్కామ్‌లో ఘరానా దొంగలు… ఎవరూ ఊహించని స్కెచ్… హీటెక్కిస్తున్నకొరియన్ హీస్ట్ మూవీ

Advertisement

సాక్షి అనే టీవీ జర్నలిస్ట్ కూడా మరో అనుమానితురాలుగా ఉంటుంది. సాక్షి ఒక మర్డర్ కేసులో అతని మీద రివెంజ్ ఎక్స్‌పోజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. విశ్వాస్ మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని భార్య కూడా కోపంలో ఉంది. బాల ఒక్కో సస్పెక్ట్‌ని లాకప్‌లో పెట్టి ఇంటరాగేట్ చేస్తాడు. ప్రతి ఒక్కరి ఫ్లాష్‌బ్యాక్ చూస్తే అందరూ కిల్లర్‌లాగానే కనిపిస్తారు. అయితే కథలో మరొక ట్విస్ట్ వస్తుంది. వీళ్ళంతా కాకుండా మరొక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. చివరికి హంతకుడు ఎవరు ? ఎందుకు చంపాడు ? బాల కిల్లర్ ని పట్టుకుంటాడా ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×