E-Paper
Advertisement

OTT Movie : డీజిల్ స్కామ్‌లో ఘరానా దొంగలు… ఎవరూ ఊహించని స్కెచ్… హీటెక్కిస్తున్నకొరియన్ హీస్ట్ మూవీ

OTT Movie : డీజిల్ స్కామ్‌లో ఘరానా దొంగలు… ఎవరూ ఊహించని స్కెచ్… హీటెక్కిస్తున్నకొరియన్ హీస్ట్ మూవీ
Advertisement

OTT Movie : కామెడీ, యాక్షన్, ట్విస్ట్‌లు ఉన్న ఓ కొరియన్ మూవీ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తోంది. దొంగతనం అంటే సీరియస్‌గా గన్ పట్టుకుని దూకడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఫుల్ కామెడీతో, ఫుల్ క్రేజీ టీమ్‌తో దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తుంది. వీకెండ్‌కి ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే క్రేజీగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ దొంగతనం చుట్టూ ఈ కథ నడుస్తుంది. చూసే కొద్ది చూడాలనిపించే ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2021లో యూ హా డైరెక్షన్ లో వచ్చిన ఈ కొరియన్ హైస్ట్ కామెడీ మూవీ సినిమా పేరు ‘పైప్‌లైన్’ (Pipeline). ఇందులో సియో ఇన్-గుక్ (పిండోలీ), లీ సూ-హ్యుక్, సౌండ్ కిమ్, యూన్ బైక్-హీ మెయిన్ రోల్స్ లో నటించారు. 108 నిమిషాలరన్ టైమ్ ఉన్న ఈ మూవీ ఐయండిబిలో 6.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

దక్షిణ కొరియాలో పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు భూగర్భంలో పైప్‌లైన్స్ ద్వారా క్రూడ్ ఆయిల్ ని తరలిస్తుంటాయి. ఒక చోట ఆ పైప్‌లైన్‌లో లీక్ అయితే బిలియన్ డాలర్ల ఆయిల్ దొంగతనం చేయవచ్చు అని ఒక రిచ్ బిజినెస్‌మ్యాన్ పిండోలీ ప్లాన్ చేస్తాడు. కానీ దానికి కావాల్సింది బెస్ట్ డ్రిల్లర్స్ & వెల్డర్స్ టీమ్. అతను దేశంలోని టాప్-6 మంది దొంగలను ఒక్కొక్కరిగా రిక్రూట్ చేస్తాడు. ఫుల్ కామెడీ సీన్స్‌తో వీళ్ళంతా నవ్విస్తుంటారు. ఆ టీమ్‌లో ఒకడు ఫుల్ డ్రింకర్, ఒకడు ఫ్యామిలీ మ్యాన్, ఒక అమ్మాయి స్నిపర్ లాంటి షూటర్… అందరూ ఒక్కటైతే గొడవలు, కామెడీ, రొమాన్స్ కూడా ఉంటుంది. ఇక ప్లాన్ లో భాగంగా, భూమి కింద 60 మీటర్లు డ్రిల్ చేసి, పైప్‌లైన్‌లో రంధ్రం పెట్టి, 30 బిలియన్ వోన్ (2,500 కోట్ల రూపాయలు) విలువైన ఆయిల్‌ని ట్యాంకర్లలోకి దారి మళ్లించాలి.

Read Also : నటి ప్రైవేట్ వీడియోలు లీక్… అపరిచితుడి ఉచ్చులో నరకం… క్లైమాక్స్ వరకూ ఉత్కంఠే

Advertisement

రాత్రి రాత్రి ఆపరేషన్ మొదలవుతుంది. డ్రిల్లింగ్, పోలీసుల నుంచి దాక్కోవడం, పైప్‌లైన్ లోపలికి క్రాల్ చేయడం… అన్నీ ఫుల్ టెన్షన్, ఫుల్ నవ్వులు. కానీ ఆఖరి నిమిషంలో పెద్ద ట్విస్ట్ పిండోలీ నిజంగా రిచ్ బాస్ కాదు, అతను కూడా ఒక దొంగే. అతను టీమ్‌ని ఉపయోగించి ఆయిల్ దొంగిలించి, టీమ్‌కి షేర్ ఇవ్వకుండా పారి పోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఇది తెలుసుకుని టీమ్ అంతా కలిసి రివర్స్ ప్లాన్ వేస్తుంది. వాళ్ళు వేసే ప్లాన్ ఏంటి ? ఆయిల్ దొంగతనం సక్సెస్ అవుతుందా ? డబ్బు ఎలా పంచుకుంటారు ? అనే విషయాలను, ఈ కొరియన్ క్రైమ్ హైస్ట్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×