E-Paper
Advertisement

CP Sajjanar: హైదరాబాద్‌లో ముఠాలపై సీపీ సజ్జనార్ ఉక్కుపాదం.. 86 మందిపై భారీ బైండోవర్

CP Sajjanar: హైదరాబాద్‌లో ముఠాలపై సీపీ సజ్జనార్ ఉక్కుపాదం.. 86 మందిపై భారీ బైండోవర్
Advertisement

CP Sajjanar: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక చర్యలు చేపట్టారు. నగరంలో ఆధిపత్య పోరు సృష్టిస్తూ అశాంతి రేపుతున్న 10 క్రిమినల్ గ్యాంగులకు చెందిన 86 మంది సభ్యులపై భారీ బైండోవర్ చర్యలు తీసుకున్నారు. నగరంలో గ్యాంగ్ వార్ కార్యకలాపాలు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తామని, శాంతిభద్రతల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

సీపీ సజ్జనార్ తన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదా వినియోగించి కేసులను స్వయంగా విచారించారు. ఈ ప్రత్యేక విచారణ కోసం టీజీ ఐసీసీసీ (Telangana Integrated Command & Control Centre)లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో అశాంతికి కారణమవుతున్న గ్యాంగ్ సభ్యులపైనే అధికారులు దృష్టి సారించారు.

Advertisement

బైండోవర్ చేసిన గ్యాంగ్ సభ్యులందరితో బీఎన్ఎస్ సెక్షన్ 126 (BNS Section 126) కింద బాండ్ సంతకం చేయించారు. ఈ సెక్షన్ ప్రకారం, వారు ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండాల్సి ఉంటుంది. మళ్లీ ఎటువంటి నేరాలకు పాల్పడబోమని సభ్యులందరి నుంచి రాతపూర్వక హామీ స్వీకరించారు.

బాండ్ కాలంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అటువంటి సందర్భాలలో బాండ్ రద్దు చేస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ముఠా తగాదాలు, నేర కార్యకలాపాలు అరికట్టడం ద్వారా నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

Advertisement

ALSO READ: Vijaysai Reddy: శ్రీకాకుళం నుంచి.. విజయసాయి రెడ్డి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×