E-Paper
Advertisement

Survival THrilller OTT : ఉరుగ్వే ఫ్లైట్ 571 విషాదగాథ… ఒక్కో సీనుకూ వణికిపోవాల్సిందే మావా

Survival THrilller OTT : ఉరుగ్వే ఫ్లైట్ 571 విషాదగాథ… ఒక్కో సీనుకూ వణికిపోవాల్సిందే మావా
Advertisement

Survival THrilller OTT : రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలను ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అందులోనూ థ్రిల్లర్ కంటెంట్ లను అస్సలు వదలటం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 1972 ఉరుగ్వే రగ్బీ టీమ్ ఆండీస్ పర్వతాల్లో ప్లేన్ క్రాష్ అయిన నిజ ఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇది రియలిస్టిక్ సర్వైవల్ డ్రామాగా ప్రశంసలు అందుకుంది. సర్వైవల్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2023 లో వచ్చిన ఈ స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సొసైటీ ఆఫ్ ది స్నో’ (Society of the Snow). జె.ఎ. బయోనా దర్శకత్వంలో ఎంజో వోగ్రిన్సిక్, అగస్టిన్ పార్డెల్లా, మాటియాస్ రెకాల్ట్ లీడ్ రోల్స్ లో నటించారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆస్కార్ నామినేషన్స్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, మేకప్) పొందింది. స్పానిష్ తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కూడా అందుబాటులో ఉంది. ఐయండిబిలో దీనికి 7.8/10 రేటింగ్ ఉంది. ఇందులో విజువల్స్ మాత్రం ఊపిరి పీల్చుకోనివ్వవు. సర్వైవర్స్ పర్ఫార్మెన్సెస్ రియల్ ఫీల్ ఇస్తాయి. స్ట్రాంగ్ మైండ్ ఉంటేనే ఈ సినిమాని చూడండి.

Advertisement

Read Also :  బ్యాంక్ సేఫ్ ను బద్దలు కొట్టడానికి మైండ్ బెండింగ్ ప్లాన్… వీడి ధైర్యానికి దండం పెట్టాలి భయ్యా

స్టోరీలోకి వెళ్తే

1972లో ఉరుగ్వే రగ్బీ టీమ్ చిలీకి వెళ్తుంటే ఫ్లైట్ 571 ఆండీస్ పర్వతాల్లో క్రాష్ అవుతుంది. ఈ ఘోరమైన ప్రమాదంలో 45 మంది ప్యాసింజర్స్‌లో 29 మంది మాత్రమే సర్వైవ్ అవుతారు. అయితే వీళ్ళంతా ఎత్తైన మంచు పర్వతాల్లో చిక్కుకుని, ఆక్సిజన్ లేకుండా, ఆహారం లేకుండా బతకడానికి పోరాడతారు. ఈ సమయంలో మంచు తుఫానులు, గాయాలతో ఒక్కొక్కరుగా చనిపోతారు. సర్వైవర్స్ డెడ్ బాడీస్ తినడం (కానిబలిజం) వంటి ఎక్స్‌ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ సీన్స్ చూడటానికి ఒళ్ళు జలదరించేలా ఉంటాయి. నందో పర్రాడో, రాబర్టో కానెసా లాంటి వాళ్లు హెల్ప్ కోసం 10 రోజులు ట్రెక్ చేసి రెస్క్యూ తెస్తారు. ఎండింగ్ ఇన్‌స్పైరింగ్ గా ముగుస్తుంది. చివరికి ఈ ప్రమాదం నుంచి16 మంది మాత్రమే బతికి బయటపడతారు. ఈ సంఘటన గురించి రియలిస్టిక్ గా తెలుసుకోవాలనుకుంటే, ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×