E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  నిజం తెలిసి రుద్రాణిని ఇంట్లోంచి గెంటేసిన ఇంద్రాదేవి

Brahmamudi Serial Today January 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  నిజం తెలిసి రుద్రాణిని ఇంట్లోంచి గెంటేసిన ఇంద్రాదేవి
Advertisement

Brahmamudi serial today Episode:

పసరు వీరయ్యను ఇంటికి తీసుకొచ్చిన కనకం రుద్రాణి చేసిన నిర్వాకం అందరికి చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. రుద్రాణి భయంగా చూస్తుంది. ఇక కనకం ఎందుకు ఇంతకు తెగించిందో మీరే అడగండి ఈవిడగారిని అంటుంది. దీంతో రుద్రాణి కోపంగా అబద్దం కనకం చెప్పిందంతా అబద్దం నాకేం సంబందం లేదు.. అసలు వీడెవడో నాకు తెలియదు.. అసలు ఇదంతా కనకం నా మీద చేస్తున్న కుట్ర.. అంటుంది. ఇంతలో రాజ్ కోపంగా రేయ్‌ చెప్పరా ఏంటి ఇదంతా అని కోప్పడగానే.. సుభాష్‌ అలా అడిగితే వాడు చెప్పడు.. రేయ్‌ కనకం చెప్పింది నిజామేనా.. చెప్పరా అంటూ చెడామడా కొడుతుంటాడు. దెబ్బలకు తాళలేక వీరయ్య అయ్యా నిజం చెప్తానయ్యా..? కనకం అమ్మగారు చెప్పిందంతా నిజమే అయ్యా..? రుద్రాణి అమ్మగారు కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి మందు కావాలి అన్నారు అయ్య.. డబ్బులు కూడా ఇచ్చారు. ఆ మందు నేనే ఇచ్చానయ్యా..అంతకు మించి నాకేం తెలియదయ్యా.. నన్ను వదిలేయండి అయ్యా అంటూ వీరయ్య అక్కడి నుంచి పారిపోతాడు.

అపర్ణ కోపంగా ఇప్పుడేం అంటావు రుద్రాణి.. మాట్లాడవేంటి..? అని అడుగుతంది. ఇంద్రాదేవి కూడా ఒసేయ్‌ ఎంత స్వార్థ పరురాలివే నువ్వు .. ఇన్నాళ్లు ఎవరి మీద విరుచుకుపడ్డా.. ఎవరిని నిందించినా.. ఎంత మంది కీడు కోరుకున్నా..? ఏదో ఒకరోజు నువ్వు మారతావని అనుకున్నాను.. ఈ ఇంటి మనుషుల ఔనత్యాన్ని తెలుసుకుంటావని అనుకున్నాను.. కానీ ఈ ఇంటి వంశాకురాన్ని పొట్టనపెట్టుకుంటావని కల్లో కూడా ఊహించలేదు అంటూ తిడుతుంది. సుభాష్‌ కూడా కోపంగా నీకు మా ఇంటికి ఏ సంబంధం లేకపోయినా కేవలం మా నాన్న మాటను గౌరవించి ఈ ఇంటి ఆడబిడ్డ స్థానం ఇచ్చాము.. నిన్ను నీ కొడుకును కూతురును సొంత మనుషుల కన్నా ఎక్కువే చూసుకున్నాం.. మేము బంధాన్ని పెంచుకుంటే.. నువ్వు బాధ్యతను తెంచుకున్నాఉ.. మేము నీకు హక్కును కల్పిస్తే నువ్వు దాన్ని అవకాశంగా తీసుకున్నావు..? ఎన్ని కుట్రలు చేసినా సహించాము.. భరించాము కానీ ఈరోజు మా అందరి కళ్లల్లో పొడవాలనుకున్నావు.. చీ నీది ఒక బతుకేనా..? అంటూ తిడతాడు.

Advertisement

ఇక ఇంద్రాదేవి కూడా ఎప్పుడో మా బావ ఇచ్చిన మాట కోసం నిన్ను దిక్కు లేని దాన్ని చేయకూడదని.. నిన్ను అనాథలా చూడకూడదని నా బిడ్డలతో పాటు నిన్ను కూతురు అనుకున్నానే.. అందరిలాగే నువ్వు కూడా ఈ ఇంటి వైభవాన్ని అనుభవించాలి అనుకున్నాను.. కానీ నీలో మనిషి చచ్చిపోయి ఇంతటి మృగం బయటకు వస్తుంది అనుకోలేదు.. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అంటూ తిడుతుండగానే.. కావ్య ఏడుస్తూ.. దగ్గరకు వచ్చి రుద్రాణి గారు ఎందుకు మీకు ఇంత భయంకరమైన ఆలోచన వచ్చింది మీకు.. ఏం ద్రోహం చేశామని ఇంత విషం కక్కాలి అనుకున్నారు.. ఈ బిడ్డను తొమ్మిది నెలలు మోయడానికి నేను ఏ తల్లి పడన కష్టాలు పడ్డాను.. ఈ ఇంటికి వారసత్వాన్ని ఇవ్వడానికి  ఎవ్వరూ దాటని గండాలను దాటాను.. నా బిడ్డకు ఈ ప్రపంచాన్ని చూపించడానికి ఆ మృత్యువుతోనే పోరాటం చేశాను కదా.. అలాంటిది కడుపులోని పిండాన్ని తుడిచేయాలని ఎలా అనిపించింది మీకు.. అంటూ ఏడుస్తుంటుంది..

రాజ్‌ కూడా అత్తయ్యా నిన్ను ఏనాడు మేనత్త అనుకోలేదు.. నా తల్లి తర్వాత తల్లి అనుకున్నాను.. నీ కొడుకు రాహుల్‌ ను నా తమ్ముడే  అనుకున్నాను.. నీ కొడుకు చెడిపోతుంటే.. రాహుల్‌ ను నిలబెట్టమని చెప్పింది అత్తయ్యా నా కళావతి. అలాంటి కళావతి కడుపు పోగొట్టాలని ఎలా అనుకున్నావు అత్తయ్య.. అంటూ రాజ్‌ ప్రశ్నిస్తుంటే.. రుద్రాణి మౌనంగా ఉంటుంది. రేయ్‌ రాజ్‌ దాన్ని ఎందుకురా ఇంకా అత్తయ్యా అని పిలుస్తున్నావు.. అలా పిలిపించుకునే  అర్హత అది ఎప్పుడో కోల్పోయింది. నా కోడలి మీద కక్ష కట్టినప్పుడే దీంతో బందం తెగిపోయింది. నా వారసుడిని నలిపేయాలని చూసినప్పుడే అది ఈ ఇంటి దృష్టిలో చచ్చిపోయింది. దీన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు.. అంటూ తిడుతుంటే.. రుద్రాణి బాధగా వదిన ఏదో క్షణికావేశంతో స్వార్తంతో తెలియని తనంతో చేశాను వదిన.. నన్ను క్షమించు వదిన.. రాజ్‌ నన్ను క్షమించు.. రాజ్‌ అని అడుగుతుంటే..

Advertisement

రాహుల్‌ కోపంగా మమ్మీ నువ్వు మాట్లాడకు.. గుండెల్లో గుణపాలు దింపి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా..? అంటూ రాహుల్‌ కోపంగా తిట్టినట్టు నటిస్తాడు. ఇంతలో ఇంద్రాదేవి కోపంగా రుద్రాణి మెడపట్టి బయటకు గెంటేస్తుంది. రుద్రాణి ఎంత బతిమాలినా విడిచిపెట్టదు.. రుద్రాణి వెళ్లిపోయాక కావ్య కళ్లు తిరిగి పడిపోతుంది… వెంటనే డాక్టర్‌ వస్తుంది. కావ్యను చెక్‌ చేస్తుంది.  కంగారు పడాల్సింది ఏమీ లేదని చెప్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ రాహుల్‌ను అనుమానిస్తే.. స్వప్న వెనకేసుకొస్తుంది. రాహుల్‌ మారిపోయాడని చెప్తుంది. తర్వాత రాత్రికి రాహుల్‌, రేఖ ఇద్దరూ కలిసి రుద్రాణిని కలుస్తారు.. మీరు ఇద్దరూ అక్కడే ఉండండి మన పగ నెరవేరాలంటే.. మీరు ఆ ఇంట్లోనే ఉండాలి.. అని చెప్తుంది. దీంతో రాహుల్‌ రేఖ సరే అంటారు. మరోవైపు కావ్య ఏడుస్తుంటే.. రాజ్‌ ఓదారుస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×