E-Paper
Advertisement

న్యూయార్క్ వీధుల్లో వణికించే గ్యాంగ్ వార్… టైటానిక్ హీరో నటించిన మరో ఆణిముత్యం

న్యూయార్క్ వీధుల్లో వణికించే గ్యాంగ్ వార్… టైటానిక్ హీరో నటించిన మరో ఆణిముత్యం
Advertisement

Historical action movie on OTT : ‘టైటానిక్’ సినిమాతో ప్రపంచం కంట్లో పడ్డ కుర్రాడు లియోనార్డో డికాప్రియో. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత మరో హిస్టారికల్ మూవీలో ఈ హీరో ఆకట్టుకున్నాడు. 1860ల కాలంలో రెండు గ్యాంగ్ ల ఆధిపత్యం కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఇది 10 ఆస్కార్ నామినేషన్లను దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా కోసం వాడిన కాస్ట్యూమ్స్, ఆయుధాల విషయంలో కూడా చిత్ర యూనిట్ ఎక్కడా రాజీ పడకుండా చాలా రీసెర్చ్ చేసి మరీ వాడారు. అందుకే ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం 1860ల నాటి న్యూయార్క్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా కూడా లియోనార్డోకి మంచి పేరు తెచ్చి పెట్టింది.
దీని పేరు? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూడచ్చు అంటే

మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఒక అద్భుతమైన హిస్టారికల్ డ్రామా సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’ (Gangs of New York). 1860ల కాలంలో న్యూయార్క్ నగరంలోని ‘ఫైవ్ పాయింట్స్’ అనే ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, డేనియల్ డే-లూయిస్, కామెరాన్ డియాజ్, జిమ్ బ్రాడ్‌బెంట్ల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెస్ ఈ కథను వెండితెరపైకి తేవడానికి దాదాపు 20 ఏళ్లు వెయిట్ చేశారు. 1970ల్లోనే ఆయన ఈ సినిమా తీయాలనుకున్నా, భారీ బడ్జెట్, సరైన టెక్నాలజీ లేక వాయిదా వేస్తూ వచ్చారు. సినిమా షూటింగ్ కోసం ఇటలీలో వేసిన సెట్స్ ఎంత పెద్దవి అంటే, అప్పట్లో ఆ సెట్‌ను చూడటానికి ఫేమస్ డైరెక్టర్ జార్జ్ లూకాస్ వచ్చి, ఇలాంటివి కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చేయొచ్చు కదా, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారని ఆశ్చర్యపోయారట. కానీ స్కోర్సెస్ మాత్రం అంతా సహజంగా ఉండాలని పట్టుబట్టి మరీ ఆ భారీ సెట్టింగ్‌లోనే సినిమాను తీశారు. ప్రస్తుతం ఇది prime Video, Netflix ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

న్యూయార్క్‌లోని ఫైవ్ పాయింట్స్ అనే ఏరియాలో రెండు పెద్ద గ్యాంగుల మధ్య భీభత్సమైన గొడవ జరుగుతుంటుంది. ఒక పక్క లోకల్ గ్యాంగ్ లీడర్ ‘బిల్ ది బుట్చర్’, మరోపక్క ఐరిష్ వలసదారుల గ్యాంగ్ లీడర్ ‘ప్రీస్ట్ వల్లన్’ (లియోనార్డో తండ్రి) తలపడతారు. ఈ రచ్చలో బిల్ చేతిలో ప్రీస్ట్ వల్లన్ దారుణంగా చనిపోతాడు. అతని చిన్నోడైన కొడుకు అమ్స్టర్‌డామ్ (లియోనార్డో డికాప్రియో) ఇదంతా కళ్లారా చూసి, ఎలాగైనా ఆ బిల్ ని చంపాలని కసితో రగిలిపోతూ అక్కడి నుండి తప్పించుకుంటాడు.

పదహారేళ్ల తర్వాత, అమ్స్టర్‌డామ్ మళ్లీ అదే ఏరియాలోకి ఎంట్రీ ఇస్తాడు. అప్పటికి బిల్ అక్కడ పెద్ద డాన్ అయిపోయి, అందరినీ వణికిస్తుంటాడు. అయితే అమ్స్టర్‌డామ్ తన అసలు పేరు దాచిపెట్టి, బిల్ దగ్గరే నమ్మకంగా చేరుతాడు. మెల్లమెల్లగా బిల్ నమ్మకాన్ని గెలిచి వాడికి రైట్ హ్యాండ్ లాగా మారిపోతాడు. వాడి పక్కనే ఉంటూనే, సరైన టైమ్ చూసి వాడిని నరికి పారెయ్యాలని పక్కా స్కెచ్ వేస్తాడు. ఈ మధ్యలో జెన్నీ అనే ఒక పిల్లి కళ్ల అమ్మాయితో మనోడికి ప్రేమాయణం కూడా సాగుతుంది.

Advertisement

కానీ చివర్లో ఒక ఫ్రెండ్ వల్ల అమ్స్టర్‌డామ్ ఎవరో బిల్ కి తెలిసిపోవడంతో సీన్ రివర్స్ అవుతుంది. ఆ తర్వాత అమ్స్టర్‌డామ్ తన పాత గ్యాంగ్‌ని ఏకం చేసి బిల్ తో ఫైనల్ ఫైట్‌కి దిగుతాడు. మరి ఈ ఫైట్ లో ఎవరు గెలిచారు ? అమ్స్టర్‌డామ్ తన రివేంజ్ తీర్చుకున్నాడా ? బిల్ చేతిలో తండ్రిలా ఓడిపోయాడా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : భూమి మీద భారీ విధ్వంసం… మంచు కొండల్లో ఇరుక్కుపోయిన ఫ్యామిలీ… తెలుగులోనూ స్ట్రీమింగ్

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×