E-Paper
Advertisement

చేతబడులు, క్షుద్రపూజలు తిప్పి కొడితే ? కొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హర్రర్, థ్రిల్లర్!

చేతబడులు, క్షుద్రపూజలు తిప్పి కొడితే ? కొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హర్రర్, థ్రిల్లర్!
Advertisement

Malayalam Horror Mystery : చేతబడులు, క్షుద్రపూజలు వంటి భయంకరమైన అంశాలతో రూపొందే సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దేవుడు, దెయ్యాలపై నమ్మకం ఉన్నా లేకపోయినా ఇలాంటి హర్రర్ సినిమాలంటే పడి చచ్చే ఓటీటీ మూవీ లవర్స్ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ‘ముతశ్శి’ (Muthassi) అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న ఫోక్ హారర్-మిస్టరీ సిరీస్. 2026 జూన్ 26న నేరుగా ZEE5లో విడుదలైన ఈ మలయాళ వెబ్ సిరీస్ ప్రేక్షకులను భయం, సస్పెన్స్, ఎమోషన్‌లతో ముంచెత్తుతుంది. నందులాల్ ఎమ్.ఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో సాంప్రదాయిక జానపద హారర్ ను ఆధునిక కుటుంబ డ్రామాతో అద్భుతంగా మేళవించారు.

కథలోకి వెళ్తే…

కేరళ-కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక ఒంటరి తులు గ్రామం. ఇక్కడి పురాతన ఇళ్లు, వింత నమ్మకాలు, కట్టుబాట్లు, రహస్యాలు ఎప్పటికీ మారవు. లీల (అఖిలా భార్గవన్) తన భర్త రాజన్ (అమిత్ చాకలాకల్) దంపతులు. వాళ్లకున్న ఏకైక కుమారుడు శ్రీకుట్టన్. అతనితో కలిసి చాలా ఏళ్ల తర్వాత తన భర్త పూర్వీకుల ఇంటికి తిరిగి వస్తుంది. మొదట్లో అంతా సాధారణంగానే ఉంటుంది. కానీ ఆ పాత ఇంట్లో అడుగు పెట్టిన కొద్దీ రోజుల్లోనే వింత వింత ఘటనలు జరగడం మొదలవుతాయి.

Advertisement

రాత్రి వేళల్లో వినిపించే విచిత్ర శబ్దాలు, ఇంటి చుట్టూ కనిపించే నీడలు భయపేడతాయి. అన్నింటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే… తన కుమారుడు శ్రీకుట్టన్ ప్రవర్తనలో వస్తున్న ఈ మార్పులు లీలను ఆందోళనకు గురి చేస్తాయి. చిన్నారి శ్రీకుట్టన్ నుంచి నెమ్మదిగా ఒక దెయ్యం పట్టిన బాలుడిగా మారిపోతున్నట్లు కనిపిస్తుంది. లీల తన కొడుకును కాపాడుకోవడానికి ఆ గ్రామంకు ఉన్న గతాన్ని, తన కుటుంబ వంశపారంపర్య రహస్యాలను వెలికి తీస్తుంది.

అప్పుడు బయటపడే నిజం ఆమెను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.తన మామ (శ్రీకుట్టన్ నానమ్మ – ముతశ్శి) గతంలో ఈ వంశం కోసం చేసిన భయంకరమైన క్షుద్ర పూజలు, రక్త తర్పణలు మరియు ఒక రాక్షసిని ఆవాహన చేసిన విషయం బయటపడుతుంది. ఆ పూజల వల్ల వంశానికి ఒక శాపం చుట్టుకుంది – మరియు ఆ శాపం ఇప్పుడు శ్రీకుట్టన్ శరీరంలో ప్రవేశించింది.ఒకవైపు తన కుమారుడిని కాపాడాలనే తల్లి ప్రేమ… మరోవైపు గ్రామ ప్రజలను, తన కుటుంబాన్ని కాపాడాలనే బాధ్యత… లీల ఒక భయంకరమైన ద్విధా స్థితిలో చిక్కుకుపోతుంది. చివరి ఎపిసోడ్‌ల్లో లీల ముందు ఉన్న ప్రశ్న చాలా కఠినమైనది.

Advertisement

తన కన్న కొడుకును రాక్షసుడిగా మారనీయాలా ? లేదా తల్లి ప్రేమతో ఆ దుష్ట శక్తిని ఓడించాలా ? అని ఆ తల్లి మాదనపడుతుంది. ఈ సిరీస్ ముగిసేసరికి మిమ్మల్ని కూడా ఆలోచనలో పడేస్తుంది. అపారమైన తల్లి ప్రేమ దుష్ట శక్తులను కూడా జయించగలదా ? ఆ రక్తంలో దాగిన సీక్రెట్ ఎప్పటికైనా బయట పడుతుందా ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ‘ముతశ్శి’ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : ఓటీటీలో ఉన్న బెస్ట్ 6 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు… ఒక్కో సిరీస్ చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×