Best Crime Thriller Web Series : అలీ ఫజల్, సోనాలి బింద్రేల సిరీస్ “రాఖ్” ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ లోని సస్పెన్స్ నచ్చిందా ? అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే సిరీస్ లు కూడా ఈ కోవకు చెందినవే. కేవలం నేరాలు కాకుండా, భావోద్వేగాలు, సమాజం, మానవ సంబంధాలు, పవర్ డైనమిక్స్ వంటి అంశాలను లోతుగా తాకే ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు చివరి ఎపిసోడ్ వరకు మిమ్మల్ని స్క్రీన్‌కి అతుక్కు పోయేలా చేస్తాయి. సస్పెన్స్, ట్విస్టులు, రియలిస్టిక్ పోలీస్ ప్రొసీజర్స్‌తో నిండిన ఆ సిరీస్‌ల లిస్ట్ పై ఒక లుక్కేద్దాం పదండి.
సోనాక్షి సిన్హా సబ్-ఇన్‌స్పెక్టర్ అంజలి భాటీగా ఒక అండర్‌డాగ్ కాప్‌గా బ్రహ్మాండంగా నటించిన ఈ సిరీస్ రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. పబ్లిక్ బాత్‌రూమ్‌లలో యువతులు రహస్యమైన పరిస్థితుల్లో చనిపోవడం, అలా చంపుతున్న సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం కోసం ఈ లేడీ సింగం ఏం చేసిందన్నది స్టోరీ. విజయ్ వర్మ ప్రమాదకరమైన సైకోపాత్ పాత్రలో భయానకంగా కనిపిస్తాడు. గుల్షన్ దేవయ్య, సోహమ్ షా కూడా కీలక పాత్రల్లో ఉన్నారు.
2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో షెఫాలీ షా డీసీపీ వర్తిక చతుర్వేదిగా అద్భుతంగా నటించారు. హుమా కురేషి, రసికా దుగల్‌లతో కూడిన బృందం నేరస్థులను పట్టుకోవడంలో ఎదుర్కొనే రాజకీయ ఒత్తిళ్లు, సిస్టమ్ సవాళ్లు వంటి అంశాలను డీప్ గా టచ్ చేశారు. వాస్తవ సంఘటనల సమాహారంతో మూడు సీజన్లు వచ్చేసిన ఈ సిరీస్ రియలిస్టిక్ పోలీసింగ్ ప్రొసీజర్స్ తో ఆకట్టుకుంటుంది.
మోనా సింగ్, వరుణ్ సోబ్తి కలిసి నటించిన ఈ సిరీస్ పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నారై హత్యను కేంద్రంగా చేసుకుని సాగుతుంది. సీజన్ 2లో మోనా సింగ్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా మరింత స్ట్రాంగ్ రోల్ పోషించింది. కుటుంబ సంబంధాలు, డ్రగ్స్, స్థానిక రాజకీయాలు, వ్యక్తిగత పగల మధ్య సాగే ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంటుంది. ఫాగ్‌లాంటి వాతావరణం సస్పెన్స్‌ను మరింత పెంచుతుంది.
భూమి పెడ్నేకర్ డీసీపీ రీటా ఫెర్రీరాగా నటించిన సిరీస్ ఇది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ను హ్యాండిల్ చేసే ఆమె ఒక సీరియల్ కిల్లర్‌ను వేటాడే కథ ఆసక్తికరంగా ఉంటుంది. చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి చేరిన ఆమె ఈ కేసును ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే. అదిత్య రావల్, సమారా తిజోరి ఇతర కీలక పాత్రలు పోషించారు.
జైదీప్ అహ్లావత్ ఇన్‌స్పెక్టర్ హథీరామ్ చౌదరీగా నటించిన ఈ సిరీస్ నేరాల ప్రపంచం, ఎలైట్ సొసైటీ మధ్య ఉన్న లింకులను ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. ఇష్వక్ సింగ్, గుల్ పనాగ్ కీలక పాత్రలు పోషించిన ఈ నియో-నాయిర్ థ్రిల్లర్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌ల్లో ఒకటి.
తమన్నా భాటియా ఇందులో బురారీ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఢిల్లీ బురారీలో 11 మంది కుటుంబ సభ్యుల రహస్య మరణాలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2018లో జరిగిన వాస్తవ సంఘటనల కేసు ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో తమన్నా భాటియా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంది. ఒకేసారి జరిగిన ఈ దిగ్భ్రాంతికర ఘటన వెనుక ఉన్న సీక్రెట్స్ ను చూసి తెలుసుకోవాల్సిందే. రాబీ గ్రేవాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్.
Read Also : ముఖ్యమంత్రి పీఠం కోసం వరుస హత్యలు… కుక్కల సంరక్షకుడి ఎంట్రీతో అదిరే ట్విస్ట్