E-Paper
Advertisement

Mystery Movie OTT : ఒకరితో ఒకరికి సంబంధం లేని ఏడుగురు ఒకే హోటల్లో… నరాలు కట్టయ్యే సస్పెన్స్ ఉన్న సినిమా

Mystery Movie OTT : ఒకరితో ఒకరికి సంబంధం లేని ఏడుగురు ఒకే హోటల్లో… నరాలు కట్టయ్యే సస్పెన్స్ ఉన్న సినిమా
Advertisement

Mystery Movie OTT : సీట్ ఎడ్జ్ థ్రిల్ పక్కా అని కొన్ని సినిమాలను చూస్తేనే అన్పిస్తుంది. సాధారణంగా ఇలాంటి థ్రిల్ సస్పెన్స్, సైకో, సర్వైవల్ థ్రిల్లర్స్ లోనే ఉంటుంది. మీరు కూడా అలాంటి సినిమాని చూడాలని అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఇంతకీ ఈ మూవీ కథ ఏంటి? పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

జేమ్స్ మాంగోల్డ్ దర్శకత్వం వహించిన అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీనే ‘ఐడెంటిటీ (Identity)’. మైఖేల్ కూనీ రాసిన స్క్రీన్‌ప్లే ఆధారంగా 2003లో తీసిన ఈ సినిమాలో జాన్ కుసాక్, రే లియోటా, అమండా పీట్, జాన్ హాక్స్, అల్ఫ్రెడ్ మోలినా వంటి స్టార్స్‌ నటించారు. ఇది ఒక మిస్టీరియస్ మర్డర్ మిస్టరీ. నరాలు కట్టేయ్యే సస్పెన్స్ మాత్రమే కాదు ఊహించని ట్విస్ట్‌లతో నిండిన క్లాసిక్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఈ వర్త్ వాచింగ్ మూవీ ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

భారీ వర్షం పడిన రాత్రితో కథ స్టార్ట్ అవుతుంది. నెవడా ఎడారిలోని ఒక మారుమూల మోటెల్‌ లో 10 మంది అపరిచితులు ఆశ్రయం పొందుతారు. అప్పటికే వర్షం వల్ల రోడ్లు మూసుకుపోతాయి, ఫోన్ లైన్స్ కట్ అవుతాయి. మోటెల్ మేనేజర్ లారీ (జాన్ హాక్స్) అందరినీ రూమ్‌ లలో ఉంచుతాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అందరూ వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్‌ల నుంచి వచ్చిన వారై ఉంటారు.

డ్రైవర్ ఎడ్ (జాన్ కుసాక్), అతని ప్యాసెంజర్ కారోలిన్ (రెబెకా డి మార్నే), ప్రాస్టిట్యూట్ పారిస్ (అమండా పీట్), ఫ్యామిలీ (టిమ్, ఆలిస్, లూ – జాన్ సి మెక్‌గిన్లీ, లీలా కెంజ్లే, బ్రెట్ లోహెర్), నూతన వధూవరులు (జిన్నీ, జార్జ్ – క్లియా డువాల్, విలియం లీ స్కాట్), పోలీస్ ఆఫీసర్ రోడ్స్ (రే లియోటా), ఇంకా అతని ప్రిజనర్ రాబర్ట్ మైన్ (జేక్ బూసే) ఈ లిస్ట్ లో ఉంటారు. అందరి పేర్లు రైమింగ్ (ఎడ్, రోడ్స్, పారిస్ మొదలైనవి) ఉండటం అన్నది ఇక్కడ ఒక క్లూ.

Advertisement

ముందుగా 10 అనే నెంబర్ కార్డు ఉన్న వ్యక్తి మర్డర్ జరుగుతుంది. తరువాత 9, 8 ఇలా వరుస మర్డర్స్ జరుగుతాయి. దీంతో అందరూ పానిక్ అవుతారు. అదే మోటెల్ లో సీరియల్ కిల్లర్ ఉన్నాడని భయపడతారు. ఎడ్, రోడ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తుండగా… కిల్లర్ నువ్వేనంటూ ఒకరిపై ఒకరు ఆరోపిస్తారు. కానీ చావులు మాత్రం ఆగవు. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు, గతానికి ఒక లింకు ఉంటుంది. ఆ గతం ఏంటి? ఎవరు, ఎందుకు ఇంతమందిని చంపుతున్నారు ? అనేది మూవీలో చూడాల్సిందే.

Also Read : ‘మన శంకర వర ప్రసాద్’ నుంచి ‘అనగనగా ఒక రాజు’ వరకు… ఈ వీకెండ్ తెలుగు సినిమాల పండగ

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×