MysterThriller OTT : కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా చూడాలి అన్పిస్తుంది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఆ కోరిక తీరడం అన్నది ఈజీ అయిపోయింది. కానీ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలు చాలా అరుదు. అలాంటి అరుదైన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఫుల్ లెంగ్త్ సినిమా గురించి కాదు. షార్ట్ ఫిల్మ్ గురించి. 2015లో విడుదలైన షార్ట్ ఫిల్మ్ అహల్య (Ahalya). సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని రామాయణంలోని అహల్య అపోహని ఆధునిక థ్రిల్లర్‌గా మార్చి స్టోరీగా మన ముందుకు తీసుకొచ్చారు. 14 నిమిషాల రన్‌టైమ్‌లోనే సస్పెన్స్, మిస్టరీని కలిపి చూపించాడు డైరెక్టర్. రాయల్ స్టాగ్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం, మిథాలజీని ఫెమినిస్ట్ యాంగిల్‌తో రూపొంది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇది సాధారణ షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక ట్విస్ట్‌తో ముగిసే మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్. IMDbలో 7.9 రేటింగ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అహల్య’ ఒక మాస్టర్‌పీస్ షార్ట్ ఫిల్మ్. అతి తక్కువ టైమ్‌లోనే డీప్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. రాధికా ఆప్టే నటన, సుజోయ్ ఘోష్ డైరెక్షన్, ట్విస్ట్ ఎండింగ్ అదిరిపోతాయి. రాధికా ఆప్టే (అహల్య పాత్రలో), సౌమిత్ర చటర్జీ (ప్రఖ్యాత ఆర్టిస్ట్ గౌతమ్ సాధు పాత్రలో), టోటా రాయ్ చౌధురి (పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్ర సేన్ పాత్రలో) నటించారు. రాధికా ఆప్టే ఈ రోల్‌తో మరింత ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లో కూడా ఫుల్ వెర్షన్ ఉంది. కానీ వన్ టైమ్ వాచ్ కాదు, రిపీటెడ్ గా చూడాలనిపిస్తుంది.
కథ మిస్టరీతో మొదలవుతుంది. ఒక యంగ్ మోడల్ అర్జున్ మిస్ అవుతాడు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్ర సేన్ (టోటా రాయ్ చౌధురి) ప్రఖ్యాత ఓల్డ్ ఆర్టిస్ట్ గౌతమ్ సాధు (సౌమిత్ర చటర్జీ) ఇంటికి వెళ్తాడు. అక్కడ అతన్ని డోర్ ఓపెన్ చేసి ఆహ్వానిస్తుంది అద్భుతమైన అందగత్తె అహల్య (రాధికా ఆప్టే). ముందు ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని చూసి ఇంద్ర డాటర్ అనుకుంటాడు. కానీ ఆమె భార్య అని తెలిసి షాక్ అవుతాడు. ఇంట్లో విచిత్రమైన డాల్స్ (బొమ్మలు) ఉంటాయి. అంతేకాదు అవి రియలిస్టిక్ గా కనిపిస్తాయి. గౌతమ్ ఒక మ్యాజికల్ స్టోన్ గురించి చెప్తాడు. దాన్ని తాకితే ఎవరైనా తాను కోరుకున్న వ్యక్తిగా మారిపోతాడట. అహల్య ఇంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది. చివరికి ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. రామాయణంలో అహల్యని ఇంద్రుడు మోసం చేసినట్టు, ఇక్కడ పవర్ డైనమిక్స్ రివర్స్ అవుతాయి. కాకపోతే అహల్య ఇక్కడ విక్టిమ్ కాదు, స్మార్ట్‌గా రివెంజ్ తీర్చుకుంటుంది. ఆ రివేంజ్, క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే వెంటనే ఈ షార్ట్ ఫిల్మ్ పై ఒక లుక్కేయండి.
Read Also : ఏం సినిమా మావా… కనికరం లేని ఊచకోత… అదరగొట్టే అమ్మాయి యాక్షన్ అడ్వెంచర్