Red Sonja OTT : హాలిడే సీజన్‌లో యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్. అల్టిమేట్ యాక్షన్ సీన్స్ తో ఓటీటీలో దుమ్మురేపుతున్న ఓ ఇంట్రస్టింగ్ మూవీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇందులో హీరోయిన్ చేసే ఫైట్స్ మైండ్ బెండింగ్ గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం… ఆ పేరేంటి? ఏ ఓటీటీలో చూడవచ్చు అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ‘రెడ్ సోన్జా’ (Red Sonja – 2025). థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మాథిల్డా లుట్జ్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ యాక్షన్-అడ్వెంచర్ ఫాంటసీ డ్రామా డిసెంబర్ 26 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇండియాలో హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు ఆడియో ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఎం.జె. బాసెట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రాబర్ట్ ఇ. హోవార్డ్ క్రియేట్ చేసిన ఫేమస్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కింది. యు.ఎస్.లో ఆగస్టులో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది.
టైటిల్ క్యారెక్టర్ రెడ్ సోన్జా (మాథిల్డా లుట్జ్) చుట్టూ సాగుతుంది ఈ మూవీ. హైర్కానియా ఫాంటసీ వరల్డ్‌లో ఉంటుంది మూవీ. రెడ్ సోన్జా చిన్నప్పుడు బార్బేరియన్స్ ఆమె విలేజ్ ను నాశనం చేస్తారు. అలాగే ఫ్యామిలీని చంపేస్తారు. ఆ ట్రాజెడీ నుంచి బయటపడి ఆమె ఒక బార్బేరియన్ హంట్రెస్‌గా మారుతుంది. రెడ్ హెయిర్, స్వార్డ్‌తో “షీ-డెవిల్ విత్ ఎ స్వార్డ్”గా ఫేమస్ అవుతుంది. సోలోగా ట్రావెల్ చేస్తున్న ఆమె… ఒకరోజు టార్చర్ చేస్తున్న బీస్ట్స్‌ను రెస్క్యూ చేయడానికి ట్రై చేసి ట్రాప్ లో పడుతుంది. క్రూయల్ టైరంట్ ఎంపరర్ డ్రాగన్ ది మాగ్నిఫిసెంట్ (రాబర్ట్ షీహాన్) ఆమెను పట్టుకుని, గ్లాడియేటర్ స్లేవ్‌గా మారుస్తాడు. డార్క్ మ్యాజిక్ తో ల్యాండ్, క్రీచర్స్‌ను మ్యూటేట్ చేసి కంట్రోల్ చేయాలనేది డ్రాగన్ ప్లాన్. అక్కడ గ్లాడియేటర్ పిట్స్‌లో సోన్జా ఫైట్స్ లో సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది.
రాగ్‌ట్యాగ్ వారియర్స్ తో కలిసి ఈ అమ్మాయి మాన్స్టర్స్‌తో ఫైట్ చేస్తుంది. తరువాత తన గ్రూప్‌తో కలిసి నుంచి ఎస్కేప్ అవుతుంది. క్లైమాక్స్‌లో ఎపిక్ బ్యాటిల్, సర్‌ప్రైజ్ ట్విస్టులు ఉంటాయి. మరి ఆ ట్విస్టులు ఏంటి? తనను స్లేవ్ గా మార్చిన డ్రాగన్ కింగ్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది ? అన్నది స్టోరీ. దుమ్మురేపే యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారు ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. హీరోయిన్ చేసే స్వార్డ్ అడ్వెంచర్స్ కళ్ళు తిప్పుకోనివ్వవు. అలాగే ఫైట్ సీన్స్ కూడా హైలెట్ గా ఉంటాయి.