E-Paper
Advertisement

Mystery thriller OTT: అడివిలో అంతుచిక్కని చావులు… వింత ఆచారాలతో ఉత్కంఠ… చూస్తే అస్సలు వదలరు

Mystery thriller OTT: అడివిలో అంతుచిక్కని చావులు… వింత ఆచారాలతో ఉత్కంఠ… చూస్తే అస్సలు వదలరు
Advertisement

Mystery thriller OTT : ఓటీటీలో ‘కాంతార’ లాంటి కంటెంట్ తో ఒక మలయాళం మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రం ‘తేయ్యం’ సంప్రదాయాల నేపథ్యంలో రూపొందింన ఒక ఆసక్తికరమైన డ్రామా. అడవి దేవతను ఆరాధిస్తూ ప్రశాంతంగా గడిపే ఆదివాసీల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఒక భయంకరమైన ఆకారం చేసే హత్యలతో కథ నెక్స్ట్ లెవల్ కి వెళ్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ మలయాళ మిస్టరీ డ్రామా మూవీ పేరు ‘హత్తనే ఉదయ’ (Hathane Udaya). ఎ.కె. కున్హిరామన్ పనిక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో దేవరాజ్ కోజికోడ్, రామ్ విజయ్, ఆతిరా సావిత్రి నటించారు. 2025 ఏప్రిల్ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఎనిమిది నెలల తరువాత 2026 January 23 నుంచి ManoramaMAX ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కేరళలో ఉత్తర మలబార్‌లోని అటవీ ప్రాంతంలో మావేద అనే ఆదివాసీ తెగ ఉంటుంది. అక్కడ ప్రజలు ‘తేయ్యం’ అనే సంప్రదాయ కళను దైవంగా భావిస్తారు. బయట ప్రపంచం ఏంటో తెలియని అమాయకులు వాళ్ళ. అయితే పక్కనే ఉన్న ఒక గ్రామంలో నాయర్ అనే పెద్దమనిషి ఉంటాడు. అతడు చాలా కిరాతకుడు కూడా . ఏ అమ్మాయిపై అయినా అతని చూవు పడినదంటే అంతే సంగతులు. అస్సలు వదిలిపెట్టడు. అతనికి అనేక అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో అడవిలో ఒక అమ్మాయి, అది కూడా ఆదివాసి అమ్మాయి హత్యకు గురువుతుంది. ఒక వింత ఆకారం వెంటాడుతూ ఆమెను చంపుతుంది.

ఇక అందరూ నాయర్ మీదే అనుమానం వ్యక్తం చేస్తారు. కాని తనకి ఏమి సంబంధం లేదని బుకాయిస్తూ, పోలీసులను తన వైపు తిప్పుకుంటాడు నాయర్. ఇదే సమయంలో అదే ఊరిలో ఉండే నారాయణ అనే అందమైన మహిళపై అతని కన్ను పడుతుంది. అతని భర్త లేని సమయంలో ఆమెపై బలవంతం చేయబోతాడు. మరోవైపు అడవిలోకి వెళ్ళిన ఆమె భర్త కూడా ఆ వింత ఆకారం చేతిలో బలవుతాడు. ఇక క్లైమాక్స్ లో మరిన్ని షాకింగ్ ట్విస్టులు బయటపడతాయి. అసలు అడవుల్లో హత్యలు చేస్తున్నది ఎవరు? నాయర్ కి ఇందులో సంబంధం ఉందా? దీని వెనుక ఏదైనా శక్తి ఉందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×