Macbook Neo vs Air M5| టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవలే తన మ్యాక్ సిరీస్ లైనప్‌లో నాలుగు కొత్త ల్యాప్‌టాప్స్ లాంచ్ చేసింది. వీటిలో మ్యాక్‌బుక్ ప్రో M5 ప్రో, మ్యాక్‌బుక్ ప్రో M5 మ్యాక్స్, మ్యాక్‌బుక్ నియో, మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ఉన్నాయి. ఈ నాలుగింటిలో మ్యాక్‌బుక్ నియో, మ్యాక్‌బుక్ ఎయిర్ M5.. డిజైన్ పరంగా రెండూ దాదాపు ఒకేలా కనిపిస్తాయి. కానీ ధరలో పెద్ద తేడా కనిపిస్తోంది.
మ్యాక్‌బుక్ నియో ఇండియాలో ప్రారంభ ధర రూ.69,900. మ్యాక్‌బుక్ ఎయిర్ M5 బేస్ మోడల్ ధర రూ.1,19,900 నుంచి మొదలవుతుంది. అంటే రెండు మోడల్స్ బేస్ వేరియంట్స్‌లో దాదాపు రూ.50,000 తేడా ఉంది. ధరలో ఈ తేడా ఎందుకు వచ్చింది? పెర్ఫామెన్స్, ప్రాసెసర్ పవర్, హార్డ్‌వేర్ సామర్థ్యాల్లోనే ప్రధాన తేడా ఉంది. రెండు ల్యాప్‌టాప్‌లు వేర్వేరు యూజర్లకు ఉపయోగపడతాయి.
ధరలోనే రెండు ల్యాప్‌టాప్‌ల మధ్య పెద్ద తేడా ఉంది. మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌ని ఆపిల్ తక్కువ బడ్జెట్ మ్యాక్‌బుక్ మోడల్‌గా లాంచ్ చేసింది. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ.69,900. మ్యాక్‌బుక్ ఎయిర్ M5 బేస్ మోడల్ రూ.1,19,900. దాదాపు రూ.50,000 ఎక్కువ చెల్లించాలి. తొలిసారి ఒక మ్యాక్‌బుక్ కొనేవారికి, బడ్జెట్‌లో మ్యాక్ కావాలనుకునేవారికి మ్యాక్‌బుక్ నియో ఉపయోగపడుతుంది. రోజువారి, సాధారణ ఆఫీస్ పనులకు సరిపోతుంది. ప్రొఫెషనల్ యూజర్లకు ఎక్కువ పవర్ కావాలంటే ఎయిర్ M5 తీసుకోవడం మంచిది.
రెండు ల్యాప్‌టాప్‌ల మరో ప్రధాన తేడా ప్రాసెసర్‌లో ఉంది. మ్యాక్‌బుక్ నియోలో A18 ప్రో చిప్ ఉంది. నియోలో మొబైల్ ప్రాసెసర్ ఆధారంగా రన్ అవుతుంది. రోజువారీ పనులు, వెబ్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ సులభంగా జరుగుతాయి. స్టూడెంట్స్, క్యాజువల్ యూజర్లకు సరిపోతుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M5లో పవర్‌ఫుల్ M5 ప్రాసెసింగ్ చిప్ ఉంది. ఇది ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రాసెసర్. డిమాండింగ్ టాస్క్‌లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. వీడియో ఎడిటింగ్, కోడింగ్, గ్రాఫిక్స్ వర్క్ స్మూత్‌గా జరుగుతాయి. పెర్ఫామెన్స్‌లో ఎయిర్ M5 చాలా బలంగా ఉంటుంది.
రెండింటిలోనూ లిక్విడ్ రెటినా డిస్‌ప్లే టెక్నాలజీ ఉంది. మ్యాక్‌బుక్ నియోలో 13 ఇంచ్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఉంది. రోజువారీ పనులకు మంచి క్లారిటీ ఇస్తుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M5లో 13.6 ఇంచ్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఉంది. పెద్ద స్క్రీన్ వల్ల మల్టీటాస్కింగ్ సులభమవుతుంది. ప్రొఫెషనల్స్‌కు ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. రెండింటి డిజైన్ స్లీక్, లైట్‌వెయిట్‌గా ఉంటాయి.
మెమొరీ, స్టోరేజ్‌లో కూడా తేడా ఉంది. మ్యాక్‌బుక్ నియోలో 8GB RAM స్టాండర్డ్‌గా ఉంటుంది. స్టోరేజ్ 512GB వరకు ఉంటుంది. లైట్ యూజర్లు, స్టూడెంట్స్‌కు సరిపోతుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M5లో 16GB RAMతో మొదలవుతుంది. 32GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. స్టోరేజ్ 4TB వరకు ఉంటుంది. పెద్ద ఫైల్స్ హ్యాండిల్ చేసే ప్రొఫెషనల్స్‌కు బాగుంటుంది.
Also Read: రియల్ వెబ్‌సైట్‌లో మోసపూరిత నెంబర్లు.. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
మీ అవసరాలకు తగిన ల్యాప్‌టాప్ ఎంచుకోవాలి. సాధారణ రోజువారీ పనులకు మ్యాక్‌బుక్ నియో బాగుంటుంది. స్టూడెంట్స్, క్యాజువల్ యూజర్లు మ్యాక్‌బుక్ నియో ఎంచుకోవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్ M5.. కంటెంట్ క్రియేటర్లు, వీడియో ఎడిటింగ్ ప్రొఫెషనల్ పనులకు అనువైనది. వీడియో ఎడిటింగ్, కోడింగ్, డిజైన్ వర్క్ స్మూత్‌గా జరుగుతాయి. బడ్జెట్‌లో మ్యాక్ కావాలనుకునేవారు నియోను, బలమైన పెర్ఫామెన్స్ కావాలనుకునేవారికి.. ఎయిర్ M5 ఎంచుకోవచ్చు.