E-Paper
Advertisement

Mystery Thriller OTT : ఆల్బమ్ రికార్డ్ కోసం వెళ్తే దెయ్యం పాప అల్లాడించేసింది… మతిపోగొట్టే మిస్టరీ థ్రిల్లర్

Mystery Thriller OTT : ఆల్బమ్ రికార్డ్ కోసం వెళ్తే దెయ్యం పాప అల్లాడించేసింది… మతిపోగొట్టే  మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Mystery Thriller OTT : దెయ్యాల సినిమాలకు ఓటీటీలో కొదవలేదు. ఈ సినిమాలు ఎక్కువగా పాడుబడిన బంగళాలలో జరుగుతుంటాయి. ఏదో ఒక కంటెంట్ తో దెయ్యాల బయటికి తెచ్చి ఆడియన్స్ ను భయపెట్టిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా దాదాపు అలానే ఉంటుంది. ఇక్కడ ఒక జంట కొత్త ట్యూన్స్ కోసం, ఒక ఇంట్లో వింత శబ్దాలను రికార్డ్ చేయడంతో ప్రమాదకరమైన ఒక పిల్ల దెయ్యం వస్తుంది. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ సైకలాజికల్ హర్రర్ మూవీ పేరు ‘Rabbit Trap’. ఈ సినిమాకు బ్రిన్ చైన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటుడు దేవ్ పటేల్, రోసీ మెక్‌వాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 జనవరి 24న సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. సెప్టెంబర్ 12 న మంగోలియా పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, Apple TV డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డార్సీ (దేవ్ పటేల్), డాఫ్నే (రోసీ) అనే భార్యాభర్తలు ఉంటారు. వీళ్ళు ఇద్దరూ మ్యూజిక్ ఆర్టిస్టులు. మంచి మ్యూజిక్ కంపోజ్ చేయాలనే ఐడియాతో సిటీకి దూరంగా ఒక పాత ఇంట్లోకి వెళ్తారు. అక్కడ ప్రకృతిలో వచ్చే రకరకాల సౌండ్స్‌ని రికార్డ్ చేస్తున్నప్పుడు, వీళ్ళకి ఒక వింతైన శబ్దం వినిపిస్తుంది. అది మామూలు సౌండ్ కాదు, ఏదో అతీత శక్తికి సంబంధించింది. ఆ సౌండ్ రికార్డ్ చేసినప్పటి నుండి ఆ ఇంట్లోకి ఒక చిన్న పాప వస్తుంది. ఆ పాప వచ్చాక వాళ్ల లైఫ్ మొత్తం మారిపోతుంది.

ఆ పాప మనిషి కాదని, అడవిలో ఉండే ఏదో ఒక వింత శక్తి అని వాళ్లకు అర్థమవుతుంది. ఆ శబ్దాల వల్ల డార్సీ పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది. ఆ చిన్న పాప వాళ్లని ఒక ఉచ్చులోకి లాగుతుంటుంది. చివరికి ఆ ఉచ్చు నుండి వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Advertisement

Read Also : తలలు లేని శవాలు తేలే నది… నరాలు కట్టయ్యే సస్పెన్స్… క్లైమాక్స్ లో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×