E-Paper
Advertisement

Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!

Ponguleti Srinivas Reddy: సంక్షేమానికి కేరాఫ్​ కాంగ్రెస్.. రెండేళ్ల లో మార్పు చూపించాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి!
Advertisement

Ponguleti Srinivas Reddy: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం రెండేళ్లలో తమ ప్రభుత్వం ప్రత్యేకమైన మార్పు చూపించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం అధికారం చేపట్టే నాటికి ఆర్ధిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నా ఒక్కో మెట్టును సరిదిద్దుతూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.సీఎం రేవంత్ రెడ్డి విజన్ తో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, గృహ నిర్మాణం, స‌న్న‌బియ్యం, రేష‌న్ కార్డులు, ఉపాధి క‌ల్ప‌న వ‌ర‌కు అన్ని రంగాల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు తెలంగాణ‌ను దేశానికి ఆద‌ర్శంగా నిలుపుతున్నాయ‌న్నారు.

ప్ర‌జా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీల‌కం 

ఈ మార్పుల‌ను ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్ధవంతంగా చేర‌వేయ‌డంలో ప్ర‌జా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీల‌కమన్నారు. అందుకే ప్ర‌స్తుత ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ది సంక్షేమ ప‌ధ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వేగ‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని స‌మాచార శాఖ అధికారుల‌కు సూచించామన్నారు.

Advertisement

Also Read: Ponguleti Srinivas Reddy: రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ: మంత్రి పొంగులేటి

ప్ర‌భుత్వ పాల‌న‌ను రెండేళ్లు పూర్తి

స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఆధునీక‌రించిన స‌మాచార పౌర‌సంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వ పాల‌న‌ను రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టామని, రెండేళ్ల కాలం మ‌రీ తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Advertisement

Also Read: CPI And CPM: కామ్రేడ్ లను కలుపుకోవట్లే.. ప్రధాన పార్టీలన్నీ పొత్తులకు ససేమిరా!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×