E-Paper
Advertisement

ప్రశాంత జీవితాన్ని తలకిందులు చేసిన హత్య… ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త మలుపు… ఊహకు అందని క్లైమాక్స్

ప్రశాంత జీవితాన్ని తలకిందులు చేసిన హత్య… ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త మలుపు… ఊహకు అందని క్లైమాక్స్
Advertisement

Mystery Thriller series : చివరి నిమిషం వరకు సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ సిరీస్ ను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ పై ఓ లుక్ వేయండి. ఇది మీ అంచనాలను ఏమాత్రం తక్కువ చేయదు. మొత్తం 6 ఎపిసోడ్ల ఈ సిరీస్ ఓటీటీలో బాగా ట్రెండ్ కూడా అయింది. ఐయండిబిలో దీనికి 7.4 రేటింగ్ కూడా ఉంది. న్యూయార్క్‌లో నివసించే ఒక సంపన్న కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక హత్య కేసుతో ఈ ఫ్యామిలీ ఎదుర్కునే సంఘటనలు మామూలుగా ఉండవు. భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే, చూసేవాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది కూడా. ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మినీ సిరీస్ పేరు ‘ది అన్ డూయింగ్’ (The Undoing). ఈ సిరీస్‌ను ప్రముఖ డానిష్ దర్శకురాలు సుసానే బియర్ తెరకెక్కించారు. ఆమె గతంలో ‘ది నైట్ మేనేజర్’ వంటి హిట్ సిరీస్‌లను రూపొందించారు. ఇందులో నికోల్ కిడ్మాన్ (గ్రేస్ ఫ్రేజర్), హ్యూ గ్రాంట్ (జోనాథన్ ఫ్రేజర్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్‌లోని నటనకు గాను నికోల్ కిడ్మాన్, హ్యూ గ్రాంట్ గోల్డెన్ గ్లోబ్స్, ఎమ్మీ, సాగ్ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఇది HBOలో అత్యధికంగా వీక్షించిన సిరీస్‌గా నిలిచింది. ప్రతి వారం దీని వ్యూయర్‌షిప్ పెరుగుతూ రావడం ఒక విశేషం. 2020లో వచ్చిన ఈ సిరీస్ ది జీన్ హాన్ఫ్ కొరెలిట్జ్ రాసిన ‘యు షుడ్ హావ్ నోన్’ అనే నవల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ (JioHotstar)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

న్యూయార్క్‌లో గ్రేస్ (నికోల్ కిడ్మాన్), జోనాథన్ (హ్యూ గ్రాంట్) అనే భార్యాభర్తలు ఉంటారు. గ్రేస్ పెద్ద సైకాలజిస్ట్, జోనాథన్ పిల్లల డాక్టర్. వీరికి ఒక కొడుకు, కోట్లలో ఆస్తి, సమాజంలో మంచి గౌరవం ఉంటాయి. అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న టైంలో, గ్రేస్ కి పరిచయం ఉన్న ఎలీనా అనే ఒక యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. అదే టైంలో జోనాథన్ ఫోన్ ఇంట్లోనే వదిలేసి ఎక్కడికో పారిపోతాడు. పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టాక అసలు రంగులు బయటపడతాయి. జోనాథన్ మంచి వాడు కాదని, చనిపోయిన ఎలీనాతో అతనికి అక్రమ సంబంధం ఉందని, ఆమెకు ఒక పాప కూడా పుట్టిందని తెలుస్తుంది.

అంతేకాదు హాస్పిటల్‌లో తప్పులు చేసినందుకు అతన్ని ఎప్పుడో పనిలోంచి తీసేశారని గ్రేస్‌కి అప్పుడే అర్థమవుతుంది. పోలీసులు జోనాథన్‌ను పట్టుకుని జైల్లో వేస్తారు. కానీ తను ఆ హత్య చేయలేదని, ఎవరో తనను ఇరికించారని జోనాథన్ తన భార్యను నమ్మిస్తాడు. తన భర్త అమాయకుడేమో అని గ్రేస్ నమ్మి, తన తండ్రి దగ్గర కోట్లు ఖర్చు చేయించి పెద్ద లాయర్‌ను పెడుతుంది. కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నప్పుడు జోనాథన్ ఒక సైకో అని, తన తప్పును ఇతరుల మీద నెట్టేయడంలో దిట్ట అని గ్రేస్‌కు క్లారిటీ వస్తుంది. చివరికి తన భర్తను కాపాడటం కంటే నిజం బయటపెట్టడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి, క్లైమాక్స్‌లో అతన్ని ఎలా ఇరికించిందనే దే ఈ థ్రిల్లింగ్ స్టోరీ.

Advertisement

Read Also : గ్యాంగ్ స్టర్లను గడగడలాడించే ట్రక్ డ్రైవర్… ఊహించని క్లైమాక్స్… ఐయండిబిలో 7.8 రేటింగ్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×