E-Paper
Advertisement

ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగు.. సర్కార్ భారీ ప్లా‌న్..?

ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగు.. సర్కార్ భారీ ప్లా‌న్..?
Advertisement

Transgender Empowerment: స్వేచ్ఛ బ్యూరో: ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని శనివారం హైద్రాబాద్ లోని గచ్చిబౌలి లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్‌లను నియమించినట్లు గుర్తుచేశారు.ఇప్పుడు స్వయం ఉపాధికి దోహదపడేలా మూడు ముఖ్య రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

ట్రాన్స్‌జెండర్‌లు భవిష్యత్..

కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు.మారుతి డ్రైవింగ్ స్కూల్ సహకారం తో ద డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఫోటోలు, వీడియోలు చిత్రీకరణతో పాటు వ్యవసాయంలో పిచికారీ, వివాహాలు ,ఇతర ఈవెంట్‌లలో విస్తృతంగా వినియోగం పెరిగిందని మంత్రి వివరించారు. ఈ శిక్షణతో ట్రాన్స్‌జెండర్‌లు భవిష్యత్ టెక్నాలజీ రంగంలో ముందుకు సాగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం 91 మంది ట్రాన్స్‌జెండర్‌లు లబ్ధి పొందనుండగా, రూ.17.72 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

దళిత సాధికారతకు సీడీఎస్ కీలక వేదిక

Advertisement

బొరబండలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ( దళితుల సమగ్ర అభివృద్ధికి ముఖ్య వేదికగా నిలుస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అద్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.శనివారం ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ ,రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సీన్ రెడ్డి తో కలిసి సీడీఎస్ ను సందర్శించి, కేంద్రంలోని సదుపాయాలు, కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సీడీఎస్ చైర్‌పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య కేంద్ర భవన నిర్మాణం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరించారు. పార్కింగ్ సౌకర్యాలు, కామన్ హాల్, డైనింగ్ హాల్, పరిపాలన కార్యాలయాలు, ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ మరియు ఫిజికల్ లైబ్రరీలు, మీడియా రూములు, శిక్షణార్థుల వసతి గదులు, అత్యాధునిక ఆడిటోరియం, దళిత్ మ్యూజియం వంటి విభాగాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.

Also Read: రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి..

Advertisement

గత 26 సంవత్సరాలుగా దళితులు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం సీడీఎస్ చేపట్టిన పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, విధాన సూచనలపై లక్ష్మయ్య వివరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, తిప్పర్తి యాదయ్య తదితరులు కూడా కేంద్ర కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన పలు కీలక కార్యక్రమాలపై ప్రతిపాదనలు మంత్రికి సమర్పించారు.

యువతకు నాయకత్వాభివృద్ధి..

ముఖ్యంగా దళిత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, యూపీఎస్సీ, టీజీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల పర్యవేక్షణ, భూహక్కుల పరిరక్షణ, సామాజిక-ఆర్థిక పరిశోధనలు, మహిళలు, యువతకు నాయకత్వాభివృద్ధి కార్యక్రమాలు, దళిత్ మ్యూజియం అభివృద్ధి, దళిత సాహిత్య డిజిటలైజేషన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడ్వాన్స్‌డ్ ఆర్కైవ్స్ స్థాపన వంటి అంశాలను అధికారులు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాల అమలుకు రూ.15 కోట్ల ఎండోమెంట్ ఫండ్ మంజూరు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.

Also read: ఎండలో ఎదురుచూపులు.. ఇవి బస్ షెల్టర్లా మందుబాబుల అడ్డాలా..?

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×